Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. జాబిల్లి జాకెట్ గోల ఎక్కువైంది!

సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2023 1:30 AM GMT
గేమ్ ఛేంజర్.. జాబిల్లి జాకెట్ గోల ఎక్కువైంది!
X

సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు అయితే ఏకంగా ఈ విషయమై సైబర్ క్రైమ్ ను ఆశ్రయించి క్రిమినల్ కేసును ఫైల్ చేశారు. నిందితులను త్వరగా పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి దొంగలే ఈ పని చేశారన్న వాదన వినిపిస్తోంది. ఎలాగో జరిగిన నష్టాన్ని సరి చేయలం కానీ.. ఇకపై జాగ్రత్తగా ఉంటే సరి.

ఇకపోతే సోషల్ మీడియా ఈ సాంగ్ లీక్ అన్న విషయంపై కన్నా కూడా పాట లిరిక్స్ పై పెద్ద చర్చే సాగుతోంది. లిరిక్స్ ఏదో తేడాగా ఉండే అంటూ శ్రోతలు కామెంట్లు పెడుతున్నారు. జరగండి జరగండి అంటూ సాగే ఈ లిరిక్స్ లో జాబిలమ్మా జాకెటేసుకుని వచ్చెనండీ అనే పదాలు హైలైట్ అవుతున్నాయి. ఈ పాట రచయిత ఎవర్రా అంటూ మార్చండి అంటూ తెగ అనేస్తున్నారు.

రచయిత ఎవరన్నది పక్కనపెడితే.. జాబిల్లికి బట్టలు ఉంటాయని ఎక్కడా రాసి లేదు. సో జాబిల్లి లాంటి అందం బట్టలు వేసుకుని వస్తున్నట్టుగా అభివర్ణించారు. గతంలోనూ ఇలాంటి లిరిక్సే వచ్చాయి. 1995 ఘరానా బుల్లోడు చిత్రంలో చుక్కల్లో తళుకులా సాంగ్ లో జాకెట్లో జాబిల్లి అంటూ వేటూరి రాశారు. ఈ పాట లిరిక్స్ పై కూడా ఇలానే పెద్ద చర్చలు జరిగాయి.

దానికి వేటూరి గట్టిగానే కౌంటర్ వేశారు. ట్యూన్ కోసం అలా రాశానని, లేదంటే జాకిట్లో రెండు జాబిల్లిలు అని రాసేవాడని అన్నారు. ఇప్పుడు జరగండీ సాంగ్ లోనూ ఇదే చర్చ సాగుతోంది. ఏదిఏమైనా.. ఒరిజినల్ వెర్షన్ సాంగ్ అఫీషియల్ వస్తే కానీ పాటపై ఓ క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీనిపై ఇంత పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మూవీటీమ్ కూడా ఇంకేమీ లీక్ కాకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం.

ఇకపోతే ఈ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో క్లారిటీ లేదు. ఎటువంటి అప్డేట్స్ కూడా రావట్లేదు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత సినిమా రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ నటిస్తోంది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితురులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.