Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ముగించాడు..మ‌రో 10రోజుల్లో మొత్తం ఫినిష్!

తాజాగా చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ ను శ‌నివారంతో ముగించాడు. త‌న పోర్ష‌న్ మొత్తం నిన్న‌టితో పూర్త‌యింది. దీంతో చ‌ర‌ణ్ అవ‌సంర ఇప్ప‌ట్లో శంక‌ర్ లేదు.

By:  Tupaki Desk   |   7 July 2024 4:30 PM GMT
చ‌ర‌ణ్ ముగించాడు..మ‌రో 10రోజుల్లో మొత్తం ఫినిష్!
X

'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ ముగించుకుని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాడా? అని అభిమానులు స‌హా చ‌ర‌ణ్ ఎంతో వెయిట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వాళ్లిద్ద‌రితో పాటు అంత‌కంటే ముఖ్య‌మైన బుచ్చిబాబు కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. చ‌ర‌ణ్ వ‌స్తే సెట్స్ కి వెళ్లిపోవ‌చ్చు అని రెడీగా ఉన్నాడు. అయితే అందుకు చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసాడు. బుచ్చి నేను రెడీ..నువ్వు రెడీనా అనేసాడు.

తాజాగా చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' షూటింగ్ ను శ‌నివారంతో ముగించాడు. త‌న పోర్ష‌న్ మొత్తం నిన్న‌టితో పూర్త‌యింది. దీంతో చ‌ర‌ణ్ అవ‌సంర ఇప్ప‌ట్లో శంక‌ర్ లేదు. మ‌ళ్లీ డ‌బ్బింగ్ ప‌నులు, ప్ర‌చారం మొద‌లైతే త‌ప్ప అంతవ‌ర‌కూ 'గేచ్ ఛేంజ‌ర్' కి సంబంధించి ప్రీబ‌ర్డ్. ఈ సినిమా షూటింగ్ సంవత్సరాలు సాగ‌డంతో అంతా విసుగు చెందిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్నో ర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

నిన్న‌టితో వాట‌న్నింటికి పుల్ స్టాప్ పెట్టేసారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొత్తం మ‌రో ప‌ది రోజుల్లో పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. ప్యాచ్ వ‌ర్క్ కోస‌మే 10 రోజులు కేటాయించిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. అంటే మ‌రో ప‌ది రోజుల త‌ర్వాత సినిమా రిలీజ్ పై కూడా ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. సినిమా రిలీజ్ పై కొన్ని నెల‌లుగా నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్, డిసెంబ‌ర్ రిలీజ్ అంటూ ర‌క‌ర‌కాల నెల‌ల పేర్లు వినిపించాయి.

కానీ శంక‌ర్ ఏ మంత్ ని ఫైన‌ల్ చేయ‌లేదు. తాజాగా అందుకు కూడా స‌మ‌యం అస‌న్న‌మైంది. టెక్నిక‌ల్ సినిమా కాదు కాబ‌ట్టి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు. మ‌హా అయితే రెండు నెల‌ల్లో ఆ ప‌నులు పూర్త‌వుతాయి. అంటే ఆగ‌స్టు త‌ర్వాత ఎప్పుడైనా రిలీజ్ తేదీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.