Begin typing your search above and press return to search.

నిఖిల్ సినిమాలో గ్లోబల్ స్టార్..?

కార్తికేయ 2 తో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ నెక్స్ట్ చేస్తున్న సినిమాలతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

By:  Tupaki Desk   |   6 Sep 2023 4:36 AM GMT
నిఖిల్ సినిమాలో గ్లోబల్ స్టార్..?
X

కార్తికేయ 2 తో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ నెక్స్ట్ చేస్తున్న సినిమాలతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. స్వయంభు అంటూ వీరుడి పాత్రలో కనిపిస్తున్న నిఖిల్ మరోపక్క ది ఇండియా హౌస్ అంటూ మరో సెన్సేషనల్ సినిమాతో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు నిఖిల్ ఇదివరకు ఎప్పుడూ లేని బజ్ తో.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ది ఇండియా హౌస్ సినిమా రాం వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను వి మెగా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్, విక్రం కలిసి నిర్మిస్తున్నారు.

ది ఇండియా హౌజ్ టీజర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించేలా చేశారు. ఓ పక్క స్వయంభు మరోపక్క ది ఇండియా హౌజ్ ఈ రెండు సినిమాలను పార్లర్ గా షూటింగ్ చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అదేంటి అంటే నిఖిల్ ది ఇండియా హౌస్ లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడని టాక్. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబర్ స్టార్ గా అవతరించిన రాం చరణ్ తను ఏ సినిమా చేసినా సరే విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది.

నిఖిల్ ది ఇండియా హౌస్ లో చరణ్ కేమియో ఉంటే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని చెప్పొచ్చు. ఎలాగు ప్రొడ్యూసర్ తనే కాబట్టి ఒక చిన్న క్యామియో అది కూడా సినిమాకు అవసరం అనిపిస్తే తప్పకుండా చరణ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నిఖిల్ సిద్ధార్థ్ ది ఇండియా హౌస్ సినిమాలో చరణ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా ఇంకా బయటకు రాలేదు.

స్వయంభు, ది ఇండియా హౌస్ రెండు డిఫరెంట్ సినిమాలతో నిఖిల్ తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత కార్తికేయ 3 కూడా లైన్ లో ఉంది. ప్రస్తుతం చందు మొండేటి నాగ చైతన్య సినిమాతో బిజీగా ఉన్నాడు. నిఖిల్ ఈ రెండు సినిమాలు చందు చైతు సినిమా పూర్తి చేశాక కానీ కార్తికేయ 3 చేసే అవకాశం ఉంది. చరణ్ సపోర్ట్ తో యువ హీరోగా ఉన్న నిఖిల్ ఈ దెబ్బతో స్టార్ స్టేటస్ అందుకునే ఛాన్స్ ఉంది. నిఖిల్ కూడా ఈ రెండు సినిమాలకు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడని తెలుస్తుంది.