Begin typing your search above and press return to search.

ఆ హిట్ జోడీని గుర్తు చేస్తారా..?

శ్రీదేవి తనయురాలు బాలీవుడ్ లో తెరంగేట్రం చేసినా తన పూర్తి ఫోకస్ అంతా సౌత్ సినిమాల మీద ఉన్నట్టు అనిపిస్తుంది

By:  Tupaki Desk   |   8 Feb 2024 3:30 AM
ఆ హిట్ జోడీని గుర్తు చేస్తారా..?
X

శ్రీదేవి తనయురాలు బాలీవుడ్ లో తెరంగేట్రం చేసినా తన పూర్తి ఫోకస్ అంతా సౌత్ సినిమాల మీద ఉన్నట్టు అనిపిస్తుంది. శ్రీదేవి తరహాలోనే తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ అవ్వాలని చూస్తున్న అమ్మడు ఫస్ట్ మూవీ ఎన్.టి.ఆర్ తో దేవర చేస్తుంది. దేవర తో టాలీవుడ్ డాషింగ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఆ సినిమాతో టాలీవుడ్ లో అదరగొట్టబోతుంది. ఇక దేవర తర్వాత జాన్వీ కపూర్ సెకండ్ ఛాన్స్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆఫర్ అందుకుందట.

చరణ్ బుచ్చి బాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని టాక్. ఈ సినిమాలో మొదట సమంతని కథానాయికగా తీసుకోవాలని అనుకోగా ఏమైందో ఏమో కానీ జాన్వికే మేకర్స్ ఓటు వేసినట్టు తెలుస్తుంది. చరణ్, జాన్వి ఈ ఇద్దరి జోడీ పై మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ కాంబినేషన్ ని సూపర్ హిట్ కాంబో చిరంజీవి, శ్రీదేవితో పోల్చుతున్నారు.

చిరంజీవి, శ్రీదేవి ఈ ఇద్దరి జోడీ తెర మీద సూపర్ హిట్ అనిపించుకుంది. 1981లో వచ్చిన రాణి కాసుల రంగమ్మలో ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత 1990 లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక 1994 లో ఎస్పి పరశురాం సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. తెర మీద చిరంజీవి, శ్రీదేవి ఈ ఇద్దరు కనిపిస్తే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ అందుకున్నట్టే.

అయితే ఇప్పుడు చరణ్, జాన్వి ఈ ఇద్దరు కూడా అదే సూపర్ హిట్ రిపీట్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చరణ్ 16వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. చరణ్, జాన్వి ఈ జంటని ప్రత్యేకంగా చూపించేలా బుచ్చి బాబు స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారట. మరి చిరు, శ్రీదేవి ఐకానిక్ కాంబినేషన్ ని చరణ్, జాన్వి రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.