Begin typing your search above and press return to search.

లియో చరణ్ గోల.. ఇది అసలు నిజం

టాక్ ఏ మాత్రం పాజిటివ్గా ఉన్నా కూడా కలెక్షన్స్ ఇంకా హై రేంజ్ లొనే ఉంటాయి అని ట్రేడ్ వర్గాలనుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   17 Oct 2023 10:53 AM GMT
లియో చరణ్ గోల.. ఇది అసలు నిజం
X

తమిళ్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ఈవారం గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఒకటి. అయితే కేవలం తమిళంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇంతకుముందు డైరెక్ట్ చేసిన విక్రమ్ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అంతకు ముందు విజయ్ సినిమాలు కూడా తెలుగులో మంచి రిజల్ట్ అందుకున్నాయి.

దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. ఇక పోటీగా నందమూరి బాలకృష్ణ భగవత్ కేసరి అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీంతో సినిమా మినిమం ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది.

టాక్ ఏ మాత్రం పాజిటివ్గా ఉన్నా కూడా కలెక్షన్స్ ఇంకా హై రేంజ్ లొనే ఉంటాయి అని ట్రేడ్ వర్గాలనుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు బజ్ తగ్గుతుంది అని అనుకున్నారో ఏమో కానీ సినిమాలో రామ్ చరణ్ ఉన్నట్లుగా అనేక రకాల గాసిప్స్ అయితే క్రియేట్ చేశారు. అయితే ఈ న్యూస్ ఎంత వైరల్ అవుతున్నా కూడా లియో టీం నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో ఈ న్యూస్ కాస్త సినిమాపై అంచనాలను అయితే పెంచింది. ఇక ఇప్పుడు మొత్తానికి రామ్ చరణ్ వర్గాల నుంచి మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇందులో ఎలాంటి నిజం లేదు అని, సినిమాలో రామ్ చరణ్ ఏ పాత్రలో నటించలేదు అని రూమర్స్ ను కొట్టి పారేశారు. దీంతో ఇప్పటివరకు వైరల్ అయినా కొన్ని పోస్టర్లు కూడా ఫేక్ అని అర్థం అయిపోయింది.

ఏదేమైనా రామ్ చరణ్ గాసిక్ మాత్రం లియో సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక సినిమా ఫలితం మొత్తం కూడా కంటెంట్ మీద ఆధారపడి ఉంది. ఆడియన్స్ కు ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రావడం ఖాయం. చూడాలి మరి లియో కంటెంట్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో.