Begin typing your search above and press return to search.

ఆ కల్ట్ దర్శకుడితో రామ్ చరణ్..?

సౌత్ ఇండస్ట్రీలో కల్ట్ అండ్ రా కంటెంట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే వెట్రిమారన్ పేరు చెబుతారు.

By:  Tupaki Desk   |   26 May 2024 11:12 AM GMT
ఆ కల్ట్ దర్శకుడితో రామ్ చరణ్..?
X

సౌత్ ఇండస్ట్రీలో కల్ట్ అండ్ రా కంటెంట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే వెట్రిమారన్ పేరు చెబుతారు. వెట్రిమారన్ అంటే ఆడుకాలం, విసారణై, వడాచెన్నై, అసురన్, విడుతలై 1 లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. రియల్ లైఫ్ సంఘటనలని, సమాజంలో బడుగు బలహీన వర్గాల సంఘర్షణని వెట్రిమారన్ తన సినిమాలతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు.

అందుకే అతని సినిమాలకి ఓ ప్రత్యేకత ఉంటుంది. కల్ట్ కంటెంట్ ని తెరపై ఆవిష్కరించడంలో వెట్రిమారన్ ని మించిన దర్శకులు లేరని సినీ విశ్లేషకులు సైతం అంటుంటారు. అతని మూవీస్ తెలుగులో కూడా డబ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా స్ట్రైట్ తెలుగు మూవీ చేయాలని వెట్రిమారన్ అనుకుంటున్నారు.

గతంలో తారక్ కి ఓ స్క్రిప్ట్ వినిపించారు. వెట్రిమారన్ కూడా పలు ఇంటర్వ్యూలలో తారక్ తో మూవీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కథ చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయని కూడా అన్నారు. కానీ ఎందుకనో వెట్రి, తారక్ కాంబినేషన్ సెట్ కాలేదు. వెట్రిమారన్ ప్రస్తుతం తమిళంలో విడుతలై పార్ట్ 2 చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే వెట్రిమారన్ ని రీసెంట్ గా రామ్ చరణ్ మీట్ అయ్యారంట. ఇద్దరు ఓ స్క్రిప్ట్ పైన డిస్కస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వెట్రిమారన్ చెప్పిన స్టోరీ రామ్ చరణ్ కి బాగా నచ్చిందనే ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై అటు వెట్రిమారన్ వైపు నుంచి గాని, ఇటు రామ్ చరణ్ వైపు నుంచి గాని ఎలాంటి స్పష్టత లేదు. వీరి కాంబోలో సినిమా వస్తే అది కచ్చితంగా రంగస్థలం మించిన మూవీ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా మూవీ ఒకటి చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. బుచ్చిబాబు తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. దాని తర్వాత వెట్రిమారన్ మూవీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందేమో చూడాలి.