రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ?
ఒక నివేదిక ప్రకారం.. కొణిదెల రామ్ చరణ్ ఆస్తులు దాదాపు 1,370 కోట్ల రూపాయలు. అతడి నెలవారీ ఆదాయం 3 కోట్ల కంటే ఎక్కువ.
By: Tupaki Desk | 10 Dec 2023 6:06 AM GMTRRR స్టార్‌గా రామ్ చరణ్ స్టార్‌డమ్ అమాంతం పదింతలైంది. ఇప్పుడు దేశంలోని పాన్ ఇండియా స్టార్లలో చరణ్ ఒకరు. ఆర్.ఆర్.ఆర్ లోని 'నాటు నాటు' ఆస్కార్ విన్ అవ్వడం వెనక సహచరుడు తారక్ తో కలిసి చరణ్ డ్యాన్సుల ఎనర్జీ కూడా ఒక ముఖ్య కారణం. ఇప్పుడు బాలీవుడ్ గోల్డెన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును గెలుచుకున్న చరణ్ గురించి మరింతగా ఆరాలు పెరిగాయి. రామ్ చరణ్ ఆస్తులు, అంతస్తులు, జీవన శైలి సహా అతడి సినిమాల గురించి చాలా శోధనలు జరుగుతున్నాయి. చెర్రీ ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు? అనేది తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చిరుత సినిమాతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన చరణ్ మగధీరతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, అటుపై ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతను ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించాడు. అతడు నటించే సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో భారీగా ఆర్జిస్తున్నాడు. సినిమాలే కాకుండా, పెప్సీ, టాటా డొకోమో, వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్‌లకు ప్రమోటర్ గా చరణ్ బాగానే సంపాదిస్తున్నాడు.
ఒక నివేదిక ప్రకారం.. కొణిదెల రామ్ చరణ్ ఆస్తులు దాదాపు 1,370 కోట్ల రూపాయలు. అతడి నెలవారీ ఆదాయం 3 కోట్ల కంటే ఎక్కువ. RRR సినిమాలో చరణ్ తన పాత్ర కోసం 45 కోట్ల రూపాయలను తీసుకున్నట్లు సమాచారం. భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో రామ్ చరణ్ కూడా ఒకరు.
హైదరాబాద్- జూబ్లీహిల్స్‌లో రామ్‌చరణ్‌కు దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ బంగ్లా ఉంది. ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. చరణ్ ఇంటి విలువ దాదాపు 38 కోట్లు ఉంటుందని అంచనా. ఇది కాకుండా రామ్ చరణ్‌కు ముంబైలో ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉంది.
రామ్ చరణ్ ఎలాంటి వాహనాలను ఉపయోగిస్తున్నారనే విషయానికి వస్తే.. అతడు దాదాపు రూ. 4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్, ఆస్టన్ మార్టిన్, ఫెరారీ పోర్టోఫినో వంటి కార్లను కలిగి ఉన్నాడు. చరణ్‌కి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది.
సినిమాల పరంగా క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని భావించే చరణ్ ఇప్పటివరకూ నటించింది కేవలం 13 సినిమాలు మాత్రమే. ఇతర హీరోలతో పోలిస్తే చాలా నెమ్మదిగా కెరీర్ ని సాగిస్తున్నాడు. అయినా అతడి ముఖ విలువ, బిజినెస్ వ్యాపకాలు ఆశ్చర్యం కలిగించే రిజల్ట్ ని అందిస్తున్నాయి. విమాన యాన రంగంలో ట్రూజెట్ లో చరణ్ పెట్టుబడులు పెట్టారని ప్రచారం ఉంది. మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేతగా భారీ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. మెగా వారసుడిగా ఆస్తిమంతుడు.. స్థితిమంతుడు.. బ్రాండ్ వ్యాల్యూ ఉన్న మగధీరుడు కావడంతో అతడి ఆస్తుల విలువ దాదాపు 1300 కోట్లను అధిగమించిందని ఓ ప్రముఖ జాతీయ మీడియా గతంలో కథనం వెలువరించింది. నటుడిగా పారితోషికాలతో పాటు బిజినెస్ లతోను చరణ్ బాగా ఆర్జిస్తున్నారు.