రామ్ చరణ్.. ఏడాది టైమ్ లో మూడు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా చేస్తోన్న మూవీ గేమ్ చేంజర్.
By: Tupaki Desk | 28 March 2024 5:14 AM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సోలోగా చేస్తోన్న మూవీ గేమ్ చేంజర్. దీనికంటే ముందు తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య చిత్రంలో నటించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. రామ్ చరణ్ క్యారెక్టర్ బాగానే ఉన్నప్పటికీ మూవీలో బలమైన కథ, కథనం బలంగా లేకపోవడంతో ఫెయిల్ అయ్యింది. ఈ సారి పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాని దిల్ రాజు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. 2024 ఆఖరులో గేమ్ చేంజర్ మూవీని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారంట. అక్టోబర్ నెలలో డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC16 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కాబోతోంది.
400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2025లో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ జోనర్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందంట. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో RC17 చిత్రాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ ఏడాది ఆఖరులో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2025 ఆఖరులో మూవీ రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్, చరణ్ కాంబోలో రంగస్థలం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరల దీంతో సెకండ్ బ్లాక్ బ్లాస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు. చరణ్ నుంచి రాబోయే ఈ మూడు సినిమాలు 12 నెలలో గ్యాప్ లో థియేటర్స్ లో వస్తాయంట.
ఒక స్టార్ హీరో నుంచి ఇంత తక్కువ టైంలో మూడు సినిమాలు రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఆర్ఆర్ఆర్ తో వచ్చిన గ్యాప్ ని వీలైనంత వేగంగా తగ్గించి. ఏడాదికి రెండు సినిమాలని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేయాలని చరణ్ ప్లాన్ చేసుకుంటున్నారంట. అందుకే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్.
అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. దిల్ రాజు తో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. ఇక కన్నడ ప్రొడక్షన్ KVN వారితో కూడా సినిమా చేయనున్నట్లు టాక్. ఇక ప్రశాంత్ నీల్ తో గతంలోనే చర్చలు జరిగాయి. మరి ఈ కొత్త కాంబినేషన్స్ పై చరణ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.