మెగా పార్టీ గ్రాండ్ సక్సెస్..నాన్నే నాకు రోల్ మోడల్!
నాకు మా నాన్నే రోల్ మోడల్ అని అన్నారు. నాన్నను చూసి ఏం నేర్చుకున్నారు? అంటే రామ్ చరణ్ నవ్వుతూ ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహనమే సహాయపడుతుంది.
By: Tupaki Desk | 4 Feb 2024 4:34 AM GMTమెగాస్టార్ చిరంజీవి ని కేంద్ర ప్రభుత్వం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్' తో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి తనయడు రామ్ చరణ్-కోడలు ఉపాసన నిన్నటి సాయంత్రం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ-రాజకీయ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం గౌరవం దక్కడం మనకు గర్వకారణం. ఆయనకు నా శుభాకాంక్షల' ని సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. 'చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నాన్నగారు అందించిన సేవలు ఎంతో గొప్పగా నిలిచాయి. అలాంటి సేవల్ని గుర్తించి ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంది. నాకు మా నాన్నే రోల్ మోడల్ అని అన్నారు. నాన్నను చూసి ఏం నేర్చుకున్నారు? అంటే రామ్ చరణ్ నవ్వుతూ ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహనమే సహాయపడుతుంది. యువకులు సీనియర్ల నుండి నేర్చుకోవలసింది అదే అంటూ సమాధానం ఇచ్చారు.
అలాగే చిరంజీవి తల్లి అంజనా దేవి కూడా అవార్డు రావడంపై స్పందించారు. చిరుకు ఈ ప్రతిష్టాత్మక సన్మానం లభించిందని తెలియగానే ఎలా ఫీలయ్యారని అడిగినప్పుడు... అంజనా దేవి ఆ రోజు ఏం మాట్లాడానో? ఏం తిన్నానో కూడా తనకు తెలియదని.. చాలా ఉత్సాహంగా ఆనందోత్సాహాలకు గురైనట్లు చెప్పారు. పద్మవిభూషణ్‌తో సత్కరించడం గురించి నాకు రాత్రి చెప్పారు. ఆ విషయం నాకు పూర్తిగా తెలియకుండానే బిడ్డను హత్తుకున్నాను.
నా కొడుకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం సాధించడం కంటే అంతకు మించి సంతోషం ఏం ఉంటుంది? చిరు చేసిన గొప్ప పనులకు ఏదో ఒకరోజు పద్మవిభూషణ్ అవార్డు వస్తుందని ముందే అనుకున్నాను అని అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. నాగార్జున.. అమల.. వెంకటేష్.. బ్రహ్మానందం.. నమ్రత ఘట్టమనేని.. దిల్ రాజు.. నవీన్ ఏర్నేని ..అల్లు అరవింద్.. దర్శకుడు శంకర్ .. డివివి దానయ్య.. సుబ్బిరామి రెడ్డి.. సాయా దేవ్.. వంశీ పైడిపల్లి.. బుచ్చిబాబు తదితరులు హాజరైనట్లు తెలుస్తోంది.