Begin typing your search above and press return to search.

RC 16 అస‌లేం జ‌రుగుతోంది?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 July 2024 4:01 AM GMT
RC 16 అస‌లేం జ‌రుగుతోంది?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ స‌క్సెస్ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ తో గేమ్ ఛేంజ‌ర్‌లో యువ ఐఏఎస్ గా, ముఖ్య‌మంత్రిగా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. త‌దుప‌రి బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో క్రీడాకారుడిగా ఇంట్రెస్టింగ్ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇటీవల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ కోసం త‌న పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు. అనంత‌రం ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆర్.సి 16 ప‌నిని ప్రారంభించాడు.

తాజాగా బుచ్చి బాబు ఆస్కార్-విజేత సంగీత దర్శకుడు A. R. రెహమాన్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో క‌లిసి ప‌ని ప్రారంభించిన ఓ ఆనందకరమైన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసాడు. ఈ ఫోటో వెన‌క స్టోరి ఆస‌క్తిని క‌లిగించింది. ఈ ముగ్గురూ RC 16 ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కోసం దుబాయ్‌లోని ఫిర్దౌస్ స్టూడియోలో ఉన్నారని తెలిసింది. వచ్చే నెలలో సినిమా టాకీ చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభం కానుంది.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో జాన్వీ కపూర్ క‌థానాయిక‌. శివ రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ అధినేత‌ వెంకట సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్ స‌హ‌కారంతో మైత్రీ మూవీ మేకర్స్ సమర్ప‌ణ‌లో ఈ చిత్రం అత్యంత భారీగా తెర‌కెక్క‌నుంది. క్రీడా నేప‌థ్యంలో అత్యంత స్ఫూర్తివంత‌మైన క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తుండ‌డంతో ఏ.ఆర్.రెహ‌మాన్ సైతం ఈ సినిమాకి ప‌ని చేయ‌డానికి ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని తెలుస్తోంది.