Begin typing your search above and press return to search.

చరణ్ ని ఢీ కొట్టేది ఎవరు..?

గ్లోబల్ స్టార్ రాం చరణ్ గేమ్ చేంజర్ ని ముగించి త్వరలో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవ్వాలని చూస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 July 2024 2:45 AM GMT
చరణ్ ని ఢీ కొట్టేది ఎవరు..?
X

గ్లోబల్ స్టార్ రాం చరణ్ గేమ్ చేంజర్ ని ముగించి త్వరలో తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవ్వాలని చూస్తున్నాడు. చరణ్ 16వ సినిమాగా బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి జతగా జాన్వి కపూర్ ని లాక్ చేశారు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుండగా హీరో పాత్రకు కావాల్సిన ఫిట్ నెస్, లుక్ ని సిద్ధం చేసుకునేందుకు చరణ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కథ కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

చరణ్ 16 సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో హీరో చాలా బలవంతుడిగా కనిపిస్తాడని తెలుస్తుండగా అతన్ను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న ఎగ్జైట్మెంట్ మొదలైంది. శత్రువు ఎంత బలంగా ఉంటే హీరో అంతకంటే బలంగా ఉంటాడు. అందుకే కొన్ని సినిమాలో హీరో పాత్రలతో పాటుగా విలన్ రోల్స్ కి సూపర్ క్రేజ్ వస్తుంది. ఐతే ఆర్సీ 16వ సినిమాలో చరణ్ తో ఫైట్ చేసేది ఎవరు. అసలు ఎవరెవరిని తీసుకోవాలని చూస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.

ఐతే ఇప్పుడు మన తెలుగు స్టార్స్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి విలన్ ని కూడా ఆ రేంజ్ కి తగినట్టుగానే తీసుకుంటున్నారు. చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ విలన్ గా చేస్తాడని టాక్. ఐతే ఆల్రెడీ అక్కడ నటులైన బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లు ఇప్పటికే తెలుగులో విలన్ గా చేస్తున్నారు. మరి చరణ్ సినిమాకు వారినే రిపీట్ చేస్తారా లేదా కొత్తగా ఏమైనా ప్రయత్నిస్తారా అన్నది చూడాలి.

స్టార్ కాంబో సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి హీరోకి తగ్గ విలన్ ని సెట్ చేసి సినిమాపై మరింత బజ్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. చరణ్ సినిమా అంటే ఇక అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా బుచ్చి బాబు ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. మరి చరణ్ నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది. సినిమాలో పూర్తి కాస్టింగ్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. చరణ్ బుచ్చి బాబు సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.