Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ - సుకుమార్.. గ్లోబల్ రేంజ్ లోనే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇటీవలే తన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేశారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:57 AM GMT
రామ్ చరణ్ - సుకుమార్.. గ్లోబల్ రేంజ్ లోనే..
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇటీవలే తన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేశారు. దర్శకుడు శంకర్ పొలిటికల్ యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉంది. గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కి విడుదల కాబోతోందని ఇటీవల నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

మరోవైపు రామ్ చరణ్ తన 16వ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తరువాత సుకుమార్ తో మరో సినిమాను (RC17) లాక్ చేశారు. సుకుమార్ గతంలో రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2కి ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే గ్యాప్ వచ్చినప్పుడు RC17 ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఈ సారి సుకుమార్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ ఒక గ్లోబల్ టచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ సినిమా కథలో గ్లోబల్ ఇష్యూని ప్రధాన కాన్ఫ్లిక్ట్ పాయింట్ గా తీసుకుంటున్నారట.

RRR తర్వాత రామ్ చరణ్ కి పాశ్చాత్య దేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, సుకుమార్ ఈ సినిమాలో గ్లోబల్ అంశాన్ని చేర్చడం, అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా చిత్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రస్తుతం సీనియర్ రైటర్స్ టీం స్క్రిప్ట్ పై పనిచేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

మరోవైపు, రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్ట్ ని బుచ్చి బాబు సనా తో లైన్ లో పెట్టారు. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా స్టార్ గా మరింత పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. సుకుమార్ తో చేస్తున్న సినిమా లో గ్లోబల్ అంశాన్ని చేర్చడం, ఈ మూవీ కి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.