Begin typing your search above and press return to search.

లియోలో చరణ్.. ఇక తేలిపోయే టైమొచ్చింది

ఇక ఇప్పుడు రామ్ చరణ్ లియో లో రాబర్ట్ జేన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు అన్నట్లుగా మరొక కొత్త వార్త వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 2:30 PM GMT
లియోలో చరణ్.. ఇక తేలిపోయే టైమొచ్చింది
X

విజయ్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ క్రైమ్ మూవీ లియో. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే లియో సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా క్యామియో పాత్రలు చేయబోతున్నారు అన్నట్లుగా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి.

అయితే దర్శకుడు లోకేష్ మాత్రం ఇది లోకేష్ మల్టివర్స్ కాదు అనే ఒక హింట్ అయితే ఇచ్చాడు. ముందుగా ఈ సినిమాకు విక్రమ్ కథకు లింక్ ఏమైనా ఉందేమో అని ఎంతగానో ఆరాటపడ్డారు. ట్రైలర్లో కొన్ని షాట్స్ కూడా చూసి విక్రమ్ కథకు దీనికి సంబంధం ఉంది అన్నట్లు వివరణలు కూడా ఇచ్చారు.

ఇక సోషల్ మీడియాలో ఆ కథనాలు వైరల్ అవుతున్న తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా చాలా రోజులుగా గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నా యి.

ఇది నిజమా కాదా అనే విషయం తెలియక ఫ్యాన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంతే కాకుండా లియోలో రామ్ చరణ్ ఉన్నాడు అన్నట్లు కొన్ని పోస్టర్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే అవి అఫీషియల్ పోస్టర్లు కాదు అని వైరల్ అయ్యాక తెలిసింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ లియో లో రాబర్ట్ జేన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు అన్నట్లుగా మరొక కొత్త వార్త వైరల్ గా మారింది.

ఈ విషయంలో కూడా అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ వచ్చే వారంలో మాత్రం లియో టీమ్ నుంచి అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సోమవారం ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేయనున్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.