రామ్ చరణ్ మరొకటి.. ఇండియాలో రెండోది..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 11 July 2024 11:19 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన యాక్షన్ తో ఓ రేంజ్ లో అలరించారు. ఇప్పుడు త్వరలో గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మూడేళ్ల క్రితం మొదలైన ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా చరణ్ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ లో చరణ్ డ్యూయెల్ రోల్ పోషిస్తుండటం విశేషం. త్వరలోనే డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి వర్క్ చేయనున్నారు. మరికొద్ది రోజుల్లో ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెట్టారు. అలా వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అలరించనున్నారు చరణ్.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా రామ్ చరణ్ ముంబై వెళ్లారు. బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొనున్నారు. అందుకు గాను నేడు ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఆ సమయంలో చరణ్.. రోల్స్ రాయిస్ కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఎయిర్ పోర్ట్ వచ్చాక స్టైలిష్ గా దిగారు. ఆ తర్వాత మెగా ప్రిన్సెస్ క్లీంకారను తీసుకుని ఉపాసన దిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
రోల్స్ రాయిస్ కారు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఆ కారు కోసమే మాట్లాడుకుంటున్నారు. రోల్స్ రాయిస్ కార్లు.. లిమిటెడ్ గా కనిపిస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర వైట్ కలర్ రోల్స్ రాయిస్ ఉంది. ఇప్పుడు చరణ్ లేటెస్ట్ వర్షన్ స్పెక్ట్రా కారును కొనుగోలు చేశారు. దాని ధర రూ.7 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అయితే ఆ కారును చరణ్ ఇటీవల కొన్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే కారుపై తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ బోర్డ్ ఉంది. హైదరాబాద్ లో ఈ వెర్షన్ ఫస్ట్ కస్టమర్ రామ్ చరణ్ నేనని సమాచారం. అయితే ఆయన దగ్గర ఇప్పటికే అనేక ఖరీదైన కార్లు ఉన్న విషయం తెలిసిందే. రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, మెర్సిడెస్ మే బ్యాక్ GLS 600, మెర్సిడేజ్ బెంజ్ GLE 450 AMG కూపే, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 వెహికల్స్ చరణ్ దగ్గర ఉన్నాయి. ఇక ఇండియాలో ఈ మోడల్ కారు ఇది రెండవది కావడం విశేషం.