Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ తో మెల్బోర్న్ మేయ‌ర్ సెల్పీ!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ది ఇండియ‌న్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్` కి గౌర‌వ అతిధి హోదాలో హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Aug 2024 6:50 AM GMT
చ‌ర‌ణ్ తో మెల్బోర్న్ మేయ‌ర్ సెల్పీ!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ `ది ఇండియ‌న్ ఫిల్మ్ పెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్` కి గౌర‌వ అతిధి హోదాలో హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. భార్య ఉపాస‌న‌తో క‌లిసి చ‌ర‌ణ్ ఆస్ట్రేలియా వెళ్లారు. ఆయ‌న వెళ్లిన నాటి నుంచి అసీస్ లో సైతం అభిమానుల హంగామా మూములుగా లేదు. తొలిరోజు అభిమానుల‌తో కొన్ని గ్రూప్ సెల్పీలు దిగారు. అభిమానుల‌కు ప్లైయింగ్ కిస్సులు ఇస్తూ వాళ్ల‌కు ప్రేమ‌ను పంచారు.


అలాగే చ‌ర‌ణ్ తో మెల్ బోర్న్ మేయ‌ర్ నిక్ రిస్ కూడా సెల్పీ దిగిన‌ట్లు తెలిపారు. దానికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. `నేను కూడా చ‌ర‌ణ్ కి వీరాభిమానినే. మ‌న న‌గ‌రాన్ని గొప్ప‌గా మార్చ‌డంలో ఇక్కడ ఉంటోన్న భార‌తీయులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ మేయ‌ర్ తో క‌లిసి స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు వెళ్లాను. అప్పుడే రామ్ చ‌ర‌ణ్ తో సెల్పీ తీసుకున్నా. ఇది నాకు చాలా కాలంగా ఉన్న కోరిక‌.

నాకున్న విష్ లిస్ట్ లో ఒక‌టి నెర‌వేరింది` అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. చ‌ర‌ణ్ అభిమానులు షేర్లు మీద షేర్లు కొడుతూ చ‌ర‌ణ్ ఖ్యాతిని మ‌రింత విస్త‌రిస్తున్నారు. అందుకే రామ్ చ‌ర‌ణ్ ని అంతా గ్లోబ‌ల్ స్టార్ అంటారంటూ కీర్తిస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత చ‌ర‌ణ్ కి గ్లోబ‌ల్ ఇమేజ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ సినిమాలో అవ‌కాశాలు సైతం వ‌చ్చాయి.

ఇక చ‌ర‌ణ్ త్వ‌ర‌లో `గేమ్ ఛేంజ‌ర్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ పార్ట్ షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.