Begin typing your search above and press return to search.

చరణ్ తప్పితే అందరిది అదే ట్రెండ్!

ఒక్క రామ్ చరణ్ మాత్రమే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ లోకి రాలేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి పార్ట్ 2 ఉంటుందని రాజమౌళి ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:41 AM GMT
చరణ్ తప్పితే అందరిది అదే ట్రెండ్!
X

బాహుబలి సిరీస్ రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఇండియన్ సినిమా రూపురేఖలు పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. వంద కోట్ల బడ్జెట్ తో సినిమా అంటేనే భయపడే నిర్మాతలని ఏకంగా 500 కోట్లు బడ్జెట్ అయిన సిద్ధపడేలా బాహుబలి సిరీస్ చేసింది. బాహుబలి పార్ట్ 1 కంటే బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 1800 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.

తరువాత వచ్చిన కేజీఎఫ్ కూడా రెండు భాగాలుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో కూడా కేజీఎఫ్ 1 కంటే కేజీఎఫ్ చాప్టర్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఈ ట్రెండ్ ఏదో బాగుందని ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. మొదటి సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని ఎనౌన్స్ చేసేస్తున్నారు.

సినిమా సూపర్ హిట్ అయితే ఎలాగూ మైలేజ్ వస్తుంది కాబట్టి పార్ట్ 2తో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చు. ఇప్పుడు పుష్ప2 అదే ప్లాన్ లో ఉంది. జూనియర్ ఎన్ఠీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న దేవర కూడా రెండు భాగాలుగా రానుందని తాజాగా కొరటాల శివ ఎనౌన్స్ చేశాడు. ప్రభాస్ సలార్ మూవీ కూడా రెండు భాగాలుగానే రిలీజ్ కానుంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి మూవీ కూడా రెండు పార్ట్స్ గానే తెరకెక్కుతోంది.

పవన్ కళ్యాణ్ OG మూవీ కూడా రెండు భాగాలుగానే సిద్ధం అవుతుందని తెలుస్తోంది. బాలకృష్ణ అఖండ సీక్వెల్ కి రంగం సిద్ధం అవుతోంది. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ మూవీ పూరితో ఇప్పుడు చేస్తున్నారు. ఒక్క రామ్ చరణ్ మాత్రమే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ లోకి రాలేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి పార్ట్ 2 ఉంటుందని రాజమౌళి ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో జక్కన్న చేయబోయే పాన్ వరల్డ్ మూవీ కూడా 2 పార్ట్స్ గానే సిద్ధం అవ్వనుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. టైర్ 2 హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ కూడా ఇప్పుడు మల్టీ పార్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. సినిమా ఫ్లాప్ అయితే కొనసాగింపు ఆలోచన పక్కన పెట్టేస్తారు. హిట్ అయితే మాత్రం పార్ట్ 2 ప్లానింగ్ చేస్తున్నారు.