Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 5:49 AM GMT
గేమ్ ఛేంజర్..  ఎన్నాళ్లకెన్నాళ్లకు..
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన షూటింగ్.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పోస్టర్ తోపాటు జరగండి సాంగ్ తప్ప సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేయలేదు మేకర్స్.


అయితే సినిమా లేట్ అయినా.. అంచనాలు మాత్రం అలానే ఉన్నాయి. శంకర్ డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. దానికి తోడు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ పోషిస్తుండడంతో మంచి అవుట్ పుట్ ను ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్ గా చరణ్ కనిపించనున్నట్లు టాక్.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "గేమ్ ఛేంజ్ కాబోతుంది. షూటింగ్ పూర్తయింది. ఇక థియేటర్లలో కలుద్దాం" అంటూ ఫోటోను కూడా షేర్ చేశారు. అందులో రామ్ చరణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ పార్ట్ ఇంకా కొంచెం మాత్రమే పెండింగ్ ఉందని తెలుస్తోంది. త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు మేకర్స్.

2024లో ఎలా అయినా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అప్పుడు మిస్ అయితే డిసెంబర్ లో విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా.. మేకర్స్ మాత్రం అన్ని వర్గాల ఆడియన్స్ లో బజ్ ను పెద్ద ఎత్తున క్రియేట్ చేయాల్సి ఉంది. అందుకు గాను పక్కా ప్లాన్ తో ముందుకెళ్లాలి.

అయితే మేకర్స్.. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఫస్ట్ డే టు లాస్ట్ డే మెగా ప్యాక్ట్ జర్నీ అంటూ చరణ్ పిక్ ను రీసెంట్ గా పోస్ట్ చేశారు. అందులో హెలికాప్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతూ ఎన్నాళ్లకెన్నాళ్లకు ఒక అప్డేట్ వచ్చిందని చెబుతున్నారు. ఇదే ర్యాపో కంటిన్యూ చేయాలంటున్నారు. మరి ప్రమోషన్స్ తో సినిమాను మేకర్స్ ఎంత హైట్ కు తీసుకువెళతారో చూడాలి.