Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ × బుచ్చిబాబు.. ఇది పరిస్థితి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని ఈపాటికి విడుదల కూడా కావాల్సింది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:30 PM GMT
గేమ్ ఛేంజర్ × బుచ్చిబాబు.. ఇది పరిస్థితి!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని ఈపాటికి విడుదల కూడా కావాల్సింది. కానీ సినిమా షూటింగ్ పనులు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉండడంతో ఆ ప్రభావం చరణ్ తదుపరి సినిమాపై కూడా పడుతోంది. రామ్ చరణ్ తేజ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కొత్త ప్రాజెక్టును ఏడాదిలో స్టార్ట్ చేయాలని అనుకున్నడు.

ఉప్పెన సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం ఏడాదికి పైన టైం తీసుకుని మరి ఎదురుచూస్తూ ఉన్నాడు. చేస్తే రామ్ చరణ్తో బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని అతను చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక ఆ లోపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు స్క్రిప్ట్ ను మరింత బలంగా మార్చే పనిలో బిజీ అయ్యాడు.

అయితే రామ్ చరణ్ తేజ్ అసలు ప్రణాళిక ఎలా ఉండబోతుంది గేమ్ ఛేంజర్ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడు అలాగే బుచ్చిబాబుతో చేయబోయే 16వ సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడు అనేది ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.ప్రకారం రామ్ చరణ్ తేజ్ ఈ ఏడాది చివరిలోపు గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తిచేయాలని అనుకున్నాడు

కానీ అది సాధ్యపడే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది కాబట్టి 2024 ఫిబ్రవరి లోపు ఆ సినిమా పనులన్నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ తర్వాత ఒక నెల గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు RC16 సినిమా కోసం రాంచరణ్ సిద్ధమవుతాడు.

అసలైతే ఇప్పుడు కూడా బుచ్చిబాబుతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయవచ్చు. కానీ ఆ సినిమాకు లుక్కు చాలావరకు డిఫరెంట్ గా ఉండబోతోంది. ప్రత్యేకంగా మెకోవర్ ఉండాలి కాబట్టి మళ్ళీ గేమ్ ఛేంజర్ సినిమాకు ఇబ్బంది అవుతుంది. అందుకే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాను ఫ్రెష్ గా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతనే మరొక ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాడు అని తెలుస్తుంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా అయితే సమ్మర్ తర్వాత విడుదల కావచ్చు అని సమాచారం.