Begin typing your search above and press return to search.

RC17 : మరో రంగస్థలం...!

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, బన్నీకి జాతీయ అవార్డు ను తెచ్చి పెట్టిన దర్శకుడు సుకుమార్‌.

By:  Tupaki Desk   |   3 Aug 2024 6:30 AM GMT
RC17 : మరో రంగస్థలం...!
X

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, బన్నీకి జాతీయ అవార్డు ను తెచ్చి పెట్టిన దర్శకుడు సుకుమార్‌. ప్రస్తుతం ఈయన పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు పుష్ప 2 పనులు పూర్తి చేసి వెంటనే సుకుమార్‌ తన తదుపరి సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.

ఇప్పటికే చరణ్‌ తో సుకుమార్‌ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. చరణ్‌ 17వ సినిమాను సుకుమార్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి సమాచారం అందింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన రంగస్థలం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇటీవలే చరణ్‌ తో చేయబోతున్న సినిమా కోసం సుకుమార్‌ స్టోరీ లాక్ చేశాడట. చరణ్‌ కూడా సుకుమార్‌ చెప్పిన స్టోరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మెగా కాంపౌండ్‌ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చరణ్ ను మరోసారి చిట్టిబాబు తరహా పాత్ర లో సుకుమార్‌ చూపించబోతున్నాడట.

రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు అనే పల్లెటూరి మాస్ కుర్రాడి పాత్రలో కనిపించాడు. ఆ తరహాలోనే చరణ్ ను చూపించాలని సుకుమార్‌ భావించి కథ ను రాసుకున్నట్లు తెలుస్తోంది. మొదట రంగస్థలం సీక్వెల్‌ అనే ప్రచారం జరిగింది. కానీ రంగస్థలం సినిమాకి ఆర్‌సీ17 కి సంబంధం లేదని సుకుమార్‌ సన్నిహితుల ద్వారా క్లారిటీ వచ్చింది.

రంగస్థలం కథ తో సంబంధం లేకుండా, ఆ సినిమా తరహాలో చరణ్‌ ను మాస్ లుక్ లో, పల్లెటూరి కుర్రాడిగా చరణ్‌ ను చూపించి మరో భారీ విజయాన్ని సుకుమార్‌ అందుకోవడం ఖాయంగా ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.

ప్రస్తుతం చరణ్‌ గేమ్‌ ఛేంజర్ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ వెంటనే బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక భారీ సినిమాను చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సుకుమార్‌ తో చేయబోతున్న సినిమా మాత్రం 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.