Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ మూడు పాత్రలు.. నిజమెంత?

దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో మూడు భిన్నమైన రోల్స్ లో నటిస్తున్నాడనే టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ చాలా చాలా ఆసక్తి పెరిగింది.

By:  Tupaki Desk   |   10 Aug 2024 5:35 AM GMT
రామ్ చరణ్ మూడు పాత్రలు.. నిజమెంత?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ చేస్తోన్న మూవీ ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ అయితే ఇప్పటికే గేమ్ చేంజర్ లో తన పోర్షన్ కి సంబందించిన షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు.

పెండింగ్ వర్క్ ని ప్రస్తుతం శంకర్ ఫినిష్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా నడుస్తోంది. మూడు విభిన్న పాత్రలలో ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ చేశారు. జై లవకుశ సినిమాలో జూనియర్ అన్నదమ్ములుగా మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించాడు. అందులో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా ఉండటం విశేషం.

దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో మూడు భిన్నమైన రోల్స్ లో నటిస్తున్నాడనే టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ చాలా చాలా ఆసక్తి పెరిగింది. అయితే నిజానికి చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రెండు పాత్రలలోనే కనిపించబోతున్నాడంట. తండ్రి అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ లీడర్ గా ఉండబోతోంది. అతనికి జోడీగా అంజలి నటించింది. ఆ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందంట.

అతని కొడుకు రామ్ నందన్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. కొంత భాగం కాలేజీ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఆ పాత్రలో కనిపిస్తాడంట. తరువాత సివిల్ సర్వీస్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ గా మారిన తర్వాత కంప్లీట్ న్యూ లుక్ లో చరణ్ క్యారెక్టర్ ఉంటుందంట. ఈ రెండు క్యారెక్టర్స్ వేరియేషన్స్ కూడా చాలా పెర్ఫెక్ట్ గా శంకర్ డిజైన్ చేశారంట. ఎస్.జె. సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు.

అవినీతి రాజకీయ నాయకుడిపై పోరాడే ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో అదిరిపోయే పాటలు, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థమన్ కూడా గేమ్ చేంజర్ లో సాంగ్స్ కి ఫ్యాన్స్ థియేటర్స్ లోనే డాన్స్ చేస్తారని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుందని దిల్ రాజు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.