2 పార్ట్స్ ట్రెండులో చరణ్ కూడానా?
అందుకే దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 10 Oct 2023 2:44 PM GMT'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఆర్సీ 16 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ కనీసం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. స్కిప్ట్ వర్క్ ఆలస్యం కావడం సహా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో బిజీ ఉండటం వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ సినిమా కూడా ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్‌లో భాగంకానుందని తెలిసింది.
వివరాళ్లోకి వెళితే.. బాహుబలి, కేజీయఫ్ సిరీస్ చిత్రాలకు దక్కిన ఆదరణతో.. కథలు చెప్పడంలో కొత్త మార్పుల వచ్చాయి. రెండు భాగాల ట్రెండ్ ఊపందుకుంది. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న ఆసక్తికర కథలన్నింటినీ... భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇది లాభదాయకంగా కూడా ఉండటంతో.. ఈ ఫార్ములాకు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.
రీసెంట్గా ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రకటించారు. ఇప్పుడు ఆర్సీ 16 కూడా ఆ బాటలోనే నడవనుందట. ఈ మధ్యే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని తెలిసింది. అయితే ఈ కథ కూడా చాలా పెద్దగా వచ్చిందట. అందుకే దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఒకవేళ ఈ వార్త కనుక నిజం అయితే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్.. గేమ్ ఛేంజర్ పూర్తి అయ్యాకే ప్రారంభం అవుతుందని ప్రచారం సాగింది. కానీ వాటిని బుచ్చిబాబు కొట్టి పారేశారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు.
సినిమా రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని బుచ్చిబాబు అన్నారు. సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. అందరూ ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామా అనుకుంటున్నారని.. కానీ ఇది వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుందని పేర్కొన్నారు.