Begin typing your search above and press return to search.

అబ్బాయిలంద‌రికీ రామ్ చ‌ర‌ణ్ విలువైన‌ స‌ల‌హా!

ఎవ‌రైనా గిప్ట్ ఇస్తే సంతోషంగా క‌ళ్ల‌కు హ‌త్త‌కుని మ‌రీ తీసుకుంటారు. ఇది బ‌య‌ట వారి విష‌యంలో. మ‌రి ప్రియురాలు..భార్యామ‌ణుల విష‌యంలో ఎలా ఉంటుందో? తెలుసా? వాళ్ల‌కి న‌చ్చిన గిప్ట్ అయితే ప‌ర్వాలేదు.

By:  Tupaki Desk   |   23 July 2023 2:03 PM GMT
అబ్బాయిలంద‌రికీ రామ్ చ‌ర‌ణ్ విలువైన‌ స‌ల‌హా!
X

ఎవ‌రైనా గిప్ట్ ఇస్తే సంతోషంగా క‌ళ్ల‌కు హ‌త్త‌కుని మ‌రీ తీసుకుంటారు. ఇది బ‌య‌ట వారి విష‌యంలో. మ‌రి ప్రియురాలు..భార్యామ‌ణుల విష‌యంలో ఎలా ఉంటుందో? తెలుసా? వాళ్ల‌కి న‌చ్చిన గిప్ట్ అయితే ప‌ర్వాలే దు. లేదంటే? సీన్ ఇలా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌కి ఓ సారి గిప్ట ఇచ్చారుట‌. అది చూసిన ఉపాస‌న చ‌ర‌ణ్ ముఖానికి విసిరి కొట్టారుట‌. దీంతో రామ్ చ‌ర‌ణ్ రియ‌లైజ్ అప్ప‌టి నుంచి గిప్ట్ లు ఇవ్వ‌డం మానేసాడుట‌. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ అనుభ‌వాన్ని పంచుకున్నాడు.

`అమ్మాయిల‌కు ఎలాంటి గిప్ట్ లు ఇవ్వాలో అబ్బాయిల‌కు అస్స‌లు తెలియ‌దు. ఈ విష‌యంలో నేను ఇంకా . పెళ్ల‌యిన కొత్త‌లో నా భార్య‌కు గిప్ట్ ఇస్తే ముఖానికి వేసి కొట్టింది. అది చాలా ఖ‌రీదైన గిప్ట్. ఇది చూసి ఉపాస న సంతోష‌ప‌డుతుంద‌నుకున్నా. కానీ నేను అనుకున్న దానికి రివ‌ర్స్ లో జ‌రిగింది ఇంట్లో. గిప్ట్ చూసిన కొన్ని సెక‌న్ల‌కే అది నా ముఖం మీద ఉంది. కానీ ఆ గిప్ట్ కొన‌డానికి నేను ఐదు గంట‌లు వెచ్చించాను.

దూరంగా ఉన్న ఓ షాప్ కి వెళ్లి మ‌రీ కొన్నాను. పెళ్లాం..ప్రేయ‌సి..సిస్ట‌ర్ కి బ‌హుమ‌తులు ఇవ్వాల‌నుకునే అబ్బాయిల‌కు నాదొక స‌ల‌హా. అమ్మాయిల్ని స‌ర్ ప్రైజ్ చేయాల‌ని అస్సులు ప్ర‌య‌త్నించ‌కండి. న‌చ్చిన షాప్ కి తీసుకెళ్లి న‌చ్చిన గిప్ట్ కొన‌డం మంచింది. సొంత నిర్ణ‌యాల‌తో గిప్టులు కొంటే ముఖం మీద‌కి వ‌స్తాయి. అమ్మాయిల‌కు ఇలాంటి స‌ర్ ప్రైజ్ లు అస్స‌లు నచ్చ‌వ‌ని త‌న అనుభ‌వాన్ని చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల ఈ దంపతుల‌కు పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. పాన జ‌నించి నెల రోజులు పూర్త‌వ్వ‌డంతో వ‌న్ మంత్ వేడుక కూడా కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దంప‌తులు త‌మ అన్యోన్య‌త గురించి చెప్పుకొచ్చారు.