Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ ఫోటో: అంబానీ కుటుంబంతో మెగా ప‌వ‌ర్‌స్టార్

రామ్ చ‌ర‌ణ్‌ని అప‌ర కుభేరుడు ముఖేష్ అంబానీ ఎంతో అభిమానంగా ప‌ల‌క‌రిస్తున్న ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2024 6:28 PM GMT
స్పెష‌ల్ ఫోటో: అంబానీ కుటుంబంతో మెగా ప‌వ‌ర్‌స్టార్
X

అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ మూడు రోజుల వివాహానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అత్యంత‌ ప్రభావవంతమైన వ్యక్తులంతా హాజరయ్యారు. ముఖ్యంగా సినీరంగం నుంచి ప్ర‌ముఖుల రాక అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అందునా సౌత్ నుంచి ఎవ‌రెవ‌రు ఆహ్వానం అందుకున్నారు? అంటూ స్టార్ల‌ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా వేచి చూసారు. అలా వెతికిన వారికి ర‌జ‌నీకాంత్, వెంక‌టేష్‌, మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్, అఖిల్, సూర్య‌ వంటి కొద్దిమంది స్టార్ల‌ను మాత్ర‌మే చూసే అవ‌కాశం ల‌భించింది. కొంద‌రు స్టార్లు అనంత్ అంబానీ- రాధిక జంట‌ పెళ్లికి హాజ‌రైనా వారికి సంబంధించిన ఫోటోలేవీ అంత‌గా వైర‌ల్ కాలేదు.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ మూడు రోజుల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు త‌న భార్య ఉపాసన, కూతురు క్లిన్‌తో కలిసి ముంబైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అంబానీ పెళ్లి వేడుక‌ల్లో చ‌రణ్ ఎంతో హుందా అయిన కాస్ట్యూమ్స్ లో క‌నిపించాడు. అత‌డితో పాటు ఈవెంట్లో ఉపాస‌న చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు వ‌ధూవ‌రులు అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్, వారి కుటుంబీకులు అయిన ముఖేష్ అంబానీ, ఇత‌రుల‌తో ఫ్రేమ్‌లో రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న జంట క‌నిపించారు.

అందుకు సంబంధించిన ఫోటోలు కొద్ది సేప‌టి క్రితం వెబ్ లోకి వ‌చ్చాయి. రామ్ చ‌ర‌ణ్‌ని అప‌ర కుభేరుడు ముఖేష్ అంబానీ ఎంతో అభిమానంగా ప‌ల‌క‌రిస్తున్న ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. అలాగే వ‌రుడు అనంత్ అంబానీని చ‌ర‌ణ్ క‌లుసుకుని అభినందిస్తున్న ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీటిలో ఉపాస‌న చిరున‌వ్వులు చిందిస్తూ ఎంతో అందంగా క‌నిపించింది.

బ్లాక్ బస్టర్ చిత్రం RRRలో ప్రముఖ సెలబ్రిటీలు అంతా అంబానీ పెళ్లికి ఆహ్వానాలు అందుకున్నారు. రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చిన పలువురు ప్రముఖులలో రామ్ చ‌ర‌ణ్‌ కూడా ఉన్నారు. అత‌డు ఈ పెళ్లిలో చాలా సంద‌డి చేసాడు. పెళ్లి మండపంలో చాలా మంది హై-ప్రొఫైల్ అతిథులతో కలిసిపోయాడు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రామ్ చ‌ర‌ణ్‌ తన చిత్రం `గేమ్ ఛేంజర్` విడుదల కోసం వేచి చూస్తున్నాడు. ఫిబ్రవరి 2021లో ప్రకటించారు. కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో థియేటర్లలోకి రానుంది.