రేర్ క్లిక్: గ్రేట్ తంబీలతో రామ్ చరణ్ పార్టీ
సంచలనాల శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రీకరణతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Aug 2023 5:44 AM GMTసంచలనాల శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రీకరణతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల భారతీయుడు 2 - గేమ్ ఛేంజర్ సినిమాల షెడ్యూళ్లను అతడు బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇంతలోనే ఒక పార్టీ నైట్ శంకర్ రిలాక్స్ మోడ్ లో కనిపించారు. దర్శకుడు శంకర్ పుట్టినరోజు వేడుక నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. గేమ్ ఛేంజర్‌లో శంకర్‌తో కలిసి పనిచేస్తున్న రామ్ చరణ్ చెన్నై వెళ్లి ఈ వేడుకకు హాజరయ్యాడు. శంకర్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
ఈ పార్టీ నైట్ ఫోటోగ్రాఫ్ లో శంకర్ తో పాటు రామ్ చరణ్ ఉన్నారు. అంతేకాదు.. జాగ్రత్తగా పరిశీలిస్తే యువహీరో రామ్ చరణ్ మునుపటి కంటే ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో. అతడిలోని ఛామ్ ఎంతో ఆకర్షిస్తోంది. టాప్ టు బాటమ్ బ్లాక్ లో కనిపించిన చరణ్ స్మైల్ ఇస్తూ ఎంతో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.
ఇక దర్శకదిగ్గజాలంతా ఈ వేడుకలో కొలువు దీరారు. శంకర్, వెట్రిమారన్, లోకేష్ కనగరాజ్, గౌతమ్ మీనన్, SJ సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, లింగుసామి, విఘ్నేష్ శివన్ తదితరులు ఈ పార్టీలో ఉన్నారు. ఇక ఇదే ఫోటోలో చియాన్ విక్రమ్‌తో పాటు టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఉన్నారు.
గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో ఒకే ఒక్కడు తరహాలో సాగుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎవరూ వెళ్లని ఎగ్జోటిక్ లొకేషన్లకు వెళ్లి షూటింగ్ చేస్తున్నారు. ఇక ఇందులో యాక్షన్ పార్ట్ కూడా నభూతోనభవిష్యతి అనే రేంజులో ఉంటుందని శంకర్ మార్క్ ప్రతి సన్నవేశంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పునఃప్రారంభమైంది. చరణ్ ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని భావిస్తున్నారు. శంకర్ కూడా కమల్ హాసన్ భారతీయుడు 2ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు చరణ్ కోసం బుచ్చిబాబు సన- జెర్సీ గౌతమ్ తిన్ననూరి వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.