వర్మ మైథలాజికల్ వార్నింగ్? వెరీ డేంజర్ అనేస్తున్నాడే!
ఫలితంగా కోట్ల రూపాయల పెట్టుబడ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
By: Tupaki Desk | 3 Aug 2024 2:31 PM GMTఇతిహాసాల మీద సినిమాలు రిస్క్ తో కూడుకున్నవే. అందుకే మహాభారతం తెరకెక్కించాలంటే ఇప్పటికి ఉన్న తన అనుభవం సరిపోదని రాజమౌళి సైతం అనేసారు. సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా `ఆదిపురుష్` తెరకెక్కించి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఫలితంగా కోట్ల రూపాయల పెట్టుబడ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. అందులో పాత్రధారులు ట్రోలింగ్ కి గురయ్యారు.
తాజాగా మైథలాజికల్ జానర్ తో సాహసాలు వద్దంటూ సంచలనాల రాంగోపాల్ వర్మ సైతం ఉద్ఘాటించారు. `పురాణాల మీద సినిమాలు చేయడం డేంజర్. ఎందుకంటే వాటి గురించి జనాలకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని మరోలా చూపిస్తే తేడా కొడుతుంది. పురాణాల్లో పాత్రల్ని మన సమాజం దేవుళ్లుగా ముద్ర వేసుకుంది. కాబట్టి సాహసం చేయకూడదు. అప్పట్లో బాబు ఘాయ్ మిస్త్రీ సంపూర్ణ రామాయణం తీసాడు.
ఎన్టీరామారావు గారు కూడా ఎన్నో సాహసాలు చేసారు వాటిని ఇప్పటికీ అంతా ఇష్టపడతారు. వాళ్ల వేషధారణ చూసి ప్రేక్షకులు చేతులెత్తి మోక్కుతారు కూడా. ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ లంకేష్ గా నటించాడు. దానిపై ఏ రేంజ్లో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. హనుమాన్ లుక్ మీద చర్చ జరిగింది. ఎన్నో విమర్శలు తెరపైకి వచ్చాయి. నేనేమంటానంటే కొత్తకథని తీసుకుని దానికి రామాయణం అనే పేరు పెట్టకుండా తీయండి.
ఆదిపురుష్ అంటే ఒకలా ఆలోచిస్తారు. రామాయణం అంటే మరోలా ఆలోచిస్తారు. ఏది ఏమైనా సాసహం చేసి ఇలాంటి సినిమాలు చేస్తున్న వారికి గుడ్ లక్` అన్నారు. అంటే ఆ గుడ్ లక్ బాలీవుడ్ రామాయణం చేస్తోన్న నితీష్ తివారీకి అనుకోవచ్చు. ఇక నాగ్అశ్విన్ `కల్కి 2898` మహాభారతం, ఇంకా చరిత్ర ఆధారంగా తీసాడు. కానీ ఎక్కడా అలాంటి పేర్లు వాడకుండా తీసాడు.ఇక్కడ నాగీ వర్మ లాజిక్కేనే వాడారు.