థియేటర్లకు డబ్బులిచ్చి ఆడించుకున్న ఆ స్టార్ ఎవరో?
'నా సినిమాలు నచ్చలేదంటే అభిమానులే చూడరు. నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తారని సూపర్ స్టార్ మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు
By: Tupaki Desk | 6 Aug 2024 7:30 AM GMT'నా సినిమాలు నచ్చలేదంటే అభిమానులే చూడరు. నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తారని సూపర్ స్టార్ మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇలాంటి అభిమానులు తనకు మాత్రమే ఉన్నారని ఓపెన్ గానే చెప్పారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే మాట్లాడుతారు. 'సినిమాలో మ్యాటర్ ఉంటే జనాలు థియేటర్ కి వచ్చి చూస్తారు. లేదంటే లేదు. అంతకు మించి ఆ సినిమా గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరమైనదిగా భావిస్తారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్లాప్ సినిమా తీస్తే గనుక రిలీజ్ తర్వాత సైలెంట్ గా ఉంటారు.
ఎలాంటి కామెంట్లు చేయరు. పోయిన సినిమా గురించి జాకీలు పెట్టి లేపడం దేనికన్నది ఆయన ఉద్దేశం. తర్వాత సినిమాతో చూసుకుందాం అనే టైప్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా పేరున్న స్టార్ హీరోలంతా కూడా జయపజయాల విషయంలో ఎంతో బ్యాలెన్స్ గా ఉంటారు. అందుకే ఇన్నేళ్ల కెరీర్ కొనసాగించ గలిగారు. అయితే ఓ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ప్లాప్ సినిమా తీసి కూడా థియేటర్లో డబ్బులు కట్టి ఆడిచడం అతడి స్పెషాల్టీ అంటూ సంచలనాల రాంగోల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం. 'ఎక్కువ రోజుల పాటు థియేటర్లో ఆ స్టార్ హీరో సినిమా ఆడాలని జనాలు రాకపోయినా ఆడిస్తాడు. ఆహీరో పేరు మాత్రం చెప్పను. ఒక పర్టిక్యులర్ హీరో తో ముంబైకు చెందిన ఓ కార్పోరేట్ కంపెనీవాళ్లు సినిమా తీసారు. అతను తెలుగులో పెద్ద స్టార్. తీసిన ఆ సినిమా ప్లాఫైంది. దాంతో ఆ కార్పోరేట్ కంపెనీ సినిమాని థియేటర్ లోంచి తీసేయాలనుకుంది. కానీ ఆ హీరో అందుకు ఒప్పుకోలేదు. ముందే తీసేస్తే అవమానంగా భావిస్తారు. అంతకు మించి అభిమానులు కూడా ఒప్పుకోరు.
దీంతో మరికొంతకాలం ఆడించాల్సిందేనని హీరో పట్టుపట్టాడు. కానీ ప్లాప్ డిపిషిట్ లో ఉన్న సినిమాని ఆడించడం ఆ కార్పెరేట్ కంపెనీకి నష్టం. దీంతో ఆహీరోనే నష్టాలు భరించేలా ముందుకొచ్చాడు. ఆ డెఫిషిట్ ఎమౌంట్, థియేటర్ రెంట్ లు పే చేస్తానని అన్నాడు. అప్పుడా కంపెనీ ఓకే ఆడించుకుం టానంటే మీ ఇష్టం అని చెప్పింది. అలా ఆ హీరో సినిమా జనం లేకపోయినా థియేటర్లో ఆడింది. ఆసినిమా ఆడుతోందని థియేటర్ లో యాడ్ కూడా ఇవ్వలేదు. అది హీరో చూసుకోలేదు. కార్పోరేట్ కంపెనీ యాడ్ఇ వ్వాల్సిన అవసరం లేదనుకుంది. కార్పోరేట్ కంపెనీ ఎంత చిన్న అమౌంట్ అయినా రూపాయి రాదంటే పైసా కూడా తీయరు' అని చెప్పుకొచ్చారు. దీంతో టాలీవుడ్ లో ఆ హీరో ఎవరు? అంటూ ఆరాలు మొదలయ్యాయి.