మోజనుకున్నారు కానీ.. ఆ పేరు వాడకూడదని అనుకున్నా..!
రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా డబల్ ఇస్మార్ట్.
By: Tupaki Desk | 13 Aug 2024 6:06 AM GMTటాలీవుడ్ పాపులర్ హీరోల లిస్ట్ లో క్లాస్ మాస్ ఆడియన్స్ అందరినీ అలరిస్తూ తన సత్తా చాటుతూ వస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా అంటే ఆల్ ఇన్ వన్ ఎంటర్టైనర్ అనేట్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో మరో పవన్ కళ్యాణ్ లా మారుతాడని అనుకున్నా ఆ తర్వాత ఎందుకో ఆశించిన క్రేజ్ తెచ్చుకోలేదు. కానీ టైర్ 2 హీరోగా రామ్ సినిమాలతో తన స్టామినా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా డబల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత వీరి కాంబోలో ఈ సినిమా వస్తుంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఈ గురువారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాం ఓ ఇంటర్వ్యూలో అసలు సినిమాల్లోకి రావాలనుకున్న విషయం గురించి ప్రస్తావించాడు. రామ్ హీరో అవ్వాలని తన ఎనిమిదేళ్ల వయసులోనే అనుకున్నాడట. ఐతే ఆ టైం లో ఇంట్లో చెబితే ఎలాగు పెదనన్న స్రవంతి రవికిషోర్ నిర్మాత కాబట్టి రామ్ కు ఆ ఆలోచన వచ్చిందని అనుకున్నారట. పెదనాన్న నిర్మాత కాబట్టి ఆ మోజు తోనే హీరో అవ్వాలని అనుకుంటున్నాడని అన్నారట. ఐతే తన ప్యాషన్ ని గుర్తించట్లేదని రాం తెలుగులో కాకుండా వేరే భాషలో హీరో అవుతా అని చెప్పాడట.
ఆ క్రమంలోనే తమిళంలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడట. చెన్నైకి వెళ్లి అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టగా ఆ టైం లో తను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి వైవీఎస్ చౌదరి గారు ఆఫర్ ఇచ్చారు. అప్పటికే తమిళంలో ఒక సినిమా కన్ఫర్మ్ అయినా కూడా వచ్చి ఇక్కడ దేవదాస్ సినిమా చేశానని చెప్పుకొచ్చారు రామ్. సో సినిమాల మీద తన కమిట్మెంట్ కేవలం పెదనాన్న నిర్మాత కాబట్టి కాదు ఆయన నిర్మాత కాకపోయినా ఉంటుందని ప్రూవ్ చేశాడు రామ్.
టాలీవుడ్ యువ హీరోల్లో ఎలాంటి సినిమాలకైనా రామ్ ఇట్టే సరిపోతాడు. ఐతే కాస్త మూస ధోరణిలో సినిమాలు చేస్తున్నాడన్న కామెంట్ తప్ప రామ్ గురించి ఎప్పుడు ఎక్కడ వేరే వార్త వినిపించదు. స్రవంతి లాంటి సొంత బ్యానర్ ఉన్నా సరే ఎక్కువగా బయట నిర్మాతలతోనే రాం సినిమాలు చేస్తుంటాడు. రామ్ డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.