డబ్బు...ఛాన్సులు మాకిప్పుడు కిక్ ఇవ్వడంలే!
అయినా కృషితో నాస్తి దుర్బిక్షం అన్నట్లు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. తాజాగా రామ్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2024 5:13 AM GMTఫైట్ మాస్టార్లు రామ్-లక్ష్మణ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసి ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోలకు ఫైట్ మాస్టర్లగా పనిచేసారు. దాదాపు అగ్ర హీరోలందరికీ స్టంట్ మాస్టర్లు వాళ్లే. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చేయాలంటే రామ్ లక్ష్మణ్ లు ఉండాల్సిందేనని హీరోలు సైతం పట్టుబడతారు. అంతగా ఫేమస్ అయిన మాస్టర్లు. ఇద్దరు కవలలు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఆస్థాయికి ఎదిగారు. పెద్దగా చదువకోలేదు కూడా.
అయినా కృషితో నాస్తి దుర్బిక్షం అన్నట్లు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. తాజాగా రామ్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఏంటో వాళ్ల మాటల్లోనే.. `ఇండస్ట్రీకి కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. కొత్తవారు వస్తున్నారు. మమ్మల్ని పక్కన పెడుతున్నారని మేము బాధపడటం లేదు. అలాంటి ఆలోచన కూడా రానివ్వం. మేము ఎలా ఎదిగామో వాళ్లు కూడా పైకి రావాలి. మేము అనేకాదు సీనియర్ ఫైట్ మాస్టర్ విజయన్, రాజు లాంటి కూడా ఉన్నారు.
వాళ్లకి ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. అన్నీ మాకే రావాలి అంటే ఎలా? అలా అనుకోవడం కూడా తప్పే. పుష్ప మొదటి భాగానికి మేమే పైస్ట్ కంపోజ్ చేసాం. రెండ భాగానికి మేము పనిచేయడం లేదు. అలా ఎందుకు జరిగిందో మాకు తెలియదు. అవకాశం రాలేదు చెయ్యలేదు అంతే. మాకెందుకు ఛాన్స్ రాలేదు? అన్నది సుకుమార్ గారినే మీలాంటి వాళ్లు అడగాలి. అడిగే హక్కు కూడా మాకు లేదు. ఇండస్ట్రీలో ఎక్స్ పెక్ట్ చేయకూడదు. వచ్చిన దాంతో సంతృప్తి పడాలి. రాలేదని బాధ పడకూడదు.
వచ్చిందని విజయంతో విర్ర వీగకూడదు. ఏదైనా సమభావనతో తీసుకోవాలి. ఇప్పటికే బాగానే సంపాదించాం. డబ్బు..అవకాశాలు మాకిప్పుడు కిక్ ఇవ్వడం లేదు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. జీవితం బాధలతో నిండి ఉందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లవ్ పెయిలైంది అని, జీవితం ఫెయిలైందని తట్టుకోలేక చనిపోతున్నారు. కానీ రేపు ఉదయం నీది అని మర్చిపోతున్నారు. జీవితం అనేది ఉదయించే సూర్యుడు లాంటింది. ఎన్ని సమస్యలున్నా సూర్యడు మళ్లీ ప్రెష్ గా ఉదయిస్తాడు. జీవితం కూడా అంతే` అని అన్నారు.