Begin typing your search above and press return to search.

అక్షర యోధుడి ఆశయ సాధకులు.. రామోజీరావు వారసులు..

తాజాగా ఆయన మరణం సినీ ఇండస్ట్రీ తో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 6:56 AM GMT
అక్షర యోధుడి ఆశయ సాధకులు.. రామోజీరావు వారసులు..
X

రామోజీరావు.. ఈ పేరు ఎరగని తెలుగు వ్యక్తి ఉండరు. సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించడంతో పాటు వ్యాపార రంగంలో కూడా తనకంటూ అద్భుతమైన కీర్తి గడిచిన అద్భుతమైన వ్యక్తి రామోజీరావు. ఈ మాటల మాంత్రికుడు తెలుగు ప్రింట్ మీడియా ని అద్భుత శిఖరాలకు తీసుకువెళ్లారు. తాజాగా ఆయన మరణం సినీ ఇండస్ట్రీ తో పాటు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈనాడు సంస్థల అధినేత అయిన రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలతో పాటు అద్భుతమైన బుల్లితెర నాటికలను కూడా తెరకెక్కించారు. రామోజీ ఫిలిం సిటీస్ నిర్మాణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ విప్లవన్ని తీసుకువచ్చారు. చాలావరకు అందరికీ ఆయన వృత్తి ,వ్యాపారం గురించి బాగా తెలుసు. కానీ ఆయన కుటుంబం, పిల్లలు గురించి చాలా తక్కువ మందికే తెలుసు.

మీడియా దిగ్గజం రామోజీరావుకు ఇద్దరు పిల్లలు. వీరిలో చిన్న కొడుకు సుమన్ చెరుకూరి ఈటీవీ బుల్లితెర అభిమానులకు పరిచయస్తుడు. తన నటనతో ఎందరినో ఆకట్టుకున్న సుమన్ ఆకస్మికంగా మరణించారు. ప్రస్తుతం రామోజీరావు కి సంబంధించిన వ్యాపారాలను అతని పెద్ద కొడుకు కిరణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఆయనతోపాటు కోడలు శైలజా కిరణ్, విజయేశ్వరి కూడా కుటుంబ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు.

అక్షర యోధుడు అస్తమించాడు..ఆయన స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాలను కొనసాగించే వారసుల గురించి ఈరోజు తెలుసుకుందాం. రామోజీరావు స్థాపించిన వ్యాపార సంస్థలలో ఈనాడు ఒక మహా వృక్షం లాంటిది. రామోజీరావు జీవించి ఉన్న సమయంలోని కొన్ని సంస్థలను పిల్లలకు అప్పగించారు. ఈనాడు కు సంబంధించిన బాధ్యతలలో కొన్ని ఆయన పెద్ద కొడుకుకి అప్పగించినప్పటికీ ఎడిటోరియల్ విషయంలో మాత్రం తుది శ్వాస విడిచే వరకు బాధ్యతలు రామోజీరావు స్వయంగా నిర్వహించేవారు.

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన రామోజీరావు మనవళ్లు మనవరాళ్లకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చారు. రామోజీరావు పెద్ద కొడుక్కి ముగ్గురు ఆడపిల్లలు. సహారి,

బృహతి, దివిజ రామోజీరావు పెద్ద కుమారుడు పిల్లలు. ఆయన చిన్న కొడుకుకి ఇద్దరు పిల్లలు సుహానా, సుజయ్. రామోజీరావు మరణం తర్వాత ఆయన మనవళ్ళు మనవరాలు తాతగారు తమకు నేర్పిన పాఠాల గురించి గుర్తు చేసుకున్నారు.

తండ్రి చనిపోయిన తర్వాత తాతయ్య తమకు సర్వస్వమై పెంచారు అని సుహానా చెప్పారు. ఇక బృహతి తన తాత ఎప్పుడు కూడా ప్రతి విషయం ఉత్తమంగా ఉండాలి అని భావించేవారు అని పేర్కొన్నారు. అంతేకాదు కష్టపడి పని చేయడంతో పాటు ఎప్పుడూ నీతిగా, నిజాయితీగా ఉండాలని ఆయన పిల్లలకు నేర్పించారట. ఇక సుజయ్ విషయాలు ఎంత కఠినంగా ఉన్నా జీవితంలో ముందుకు వెళ్లడం ఆపకూడదు అని తన తాతయ్య చెప్పిన సూక్తి గుర్తు చేసుకున్నాడు. చదువు పట్ల రామోజీరావు గారికి ఉన్న ప్రేమ నుంచి దివిజ స్ఫూర్తి పొందింది.