Begin typing your search above and press return to search.

రానా నాయుడులో ఇస్మార్ట్ ఎంట్రీ..?

వేలకు వేలు ఖర్చు పెట్టి థియేటర్ కు వెళ్లలేని సినీ ప్రియులంతా కూడా OTTలో సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 5:19 AM GMT
రానా నాయుడులో ఇస్మార్ట్ ఎంట్రీ..?
X

వేలకు వేలు ఖర్చు పెట్టి థియేటర్ కు వెళ్లలేని సినీ ప్రియులంతా కూడా OTTలో సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాలే కాదు అక్కడ వెబ్ సీరీస్ లకు భారీ డిమాండ్ ఉంది. అందుకే నెట్ ఫ్లిక్స్, ప్రైం వీడియోస్ వారు కోట్లకు కోట్లు పెట్టి క్రేజీ వెబ్ సీరీస్ లను చేస్తున్నారు. సౌత్ స్టార్స్ కూడా వెబ్ సీరీస్ లపై ఆసక్తి పెంచుకున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే స్టార్ హీరోల్లో వెంకటేష్, రానా ఇప్పటికే వెబ్ సీరీస్ చేసి ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేసిన రానా నాయుడు వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. మన దగ్గర వెంకటేష్ కి ఉన్న క్లాస్ ఇమేజ్ కి ఆయన పాత్ర ఎక్కలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం రానా నాయుడు సీరీస్ ని బాగా ఎంజాయ్ చేశారు.

నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో సుపర్న్ వెర్మ, కరణ్ అన్షుమన్ డైరెక్ట్ చేసిన రానా నాయుడు సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఐతే ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉండగా లేటెస్ట్ గా వెంకటేష్, రానా ముంబైలో కనిపించడంతో రానా నాయుడు 2 కోసమే వీళ్లు అక్కడకు వెళ్లారని అంటున్నారు. ఐతే వెంకటేష్, రానాలతో పాటుగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ముంబైలో వీరితో కనిపించాడు.

వెంకటేష్, రానా వెళ్తే రానా నాయుడు కోసం అనుకోగా ఇప్పుడు రామ్ కూడా వెళ్లడంతో రానా నాయుడు 2 లో రాం కూడా ఉంటాడా అన్న డౌట్ కొడుతుంది. రామ్ కూడా ఎప్పటినుంచో వెబ్ సీరీస్ లు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ సరైన సబ్జెక్ట్ దొరకట్లేదు. ఆడియన్స్ ని మెప్పించడానికి ఏ ఫ్లాట్ ఫాం ని వదలట్లేదు స్టార్స్. అందుకే ఓటీటీ వెబ్ సీరీస్ ల మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ కూడా రానా నాయుడులో భాగం అవుతాడని చెప్పుకుంటున్నారు.

రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు పూరీ. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. వెంకటేష్, రానా, రామ్ లతో పాటుగా అర్జున్ రాంపాల్ కూడా ముంబైలో వీరి డిస్కషన్స్ లో కనిపించాడు. మొత్తానికి ముగ్గురు కలిసి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.