Begin typing your search above and press return to search.

రామ్ పోతినేని హిందీ క్రేజ్.. ఇస్మార్ట్ కు కలిసొచ్చేనా?

రామ్ నుంచి వచ్చిన 9 సినిమాలకి కూడా హిందీ వెర్షన్స్ గా యూట్యూబ్ లో ఒక్కోటి 100 మిలియన్ వ్యూవ్స్ తెచ్చుకొని అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.

By:  Tupaki Desk   |   26 July 2024 5:48 AM GMT
రామ్ పోతినేని హిందీ క్రేజ్.. ఇస్మార్ట్ కు కలిసొచ్చేనా?
X

టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ పోతినేని తనదైన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోలలో రామ్ పోతినేని కూడా ఒకరు. ఈ జనరేషన్ అమ్మాయిలకు రామ్ అంటే ప్రత్యేకమైన క్రష్ ఉంది. అమ్మాయిల నుంచి ఆయన సినిమాలకు కూడా ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని నిర్మించారు. రామ్, పూరి కలియకలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రెడీ అయ్యింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రం ద్వారా ప్రతినాయకుడిగా తెలుగులోకి అడుగు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తూ ఉండడంతో డబుల్ ఇస్మార్ట్ పై తెలుగు రాష్ట్రాల్లో కొంత హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఈ సినిమా బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హిందీలో కూడా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి ఆదరణ లభించే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం యూట్యూబ్ లో రామ్ పోతినేని సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండడమే. గత ఏడాది రామ్ నుంచి వచ్చిన స్కంద సినిమా 100 మిలియన్ వ్యూవ్స్ ని సొంతం చేసుకుంది.

అంతకుముందు రిలీజ్ అయిన ది వారియర్ కూడా 100 మిలియన్ వ్యూవ్స్ దక్కించుకోవడం విశేషం. రామ్ నుంచి వచ్చిన 9 సినిమాలకి కూడా హిందీ వెర్షన్స్ గా యూట్యూబ్ లో ఒక్కోటి 100 మిలియన్ వ్యూవ్స్ తెచ్చుకొని అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి. ఇప్పటివరకు ఏ హీరో నుంచి ఇన్ని సినిమాలు 100 మిలియన్స్ కి పైగా వ్యూవ్స్ ని యుట్యూబ్ లో సాధించలేదు. స్కంద, ది వారియర్ కాకుండా హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ, నేను శైలజా, పండగ చేస్కో, ఇస్మార్ట్ శంకర్, గణేష్, హైపర్ సినిమాlu 100 మిలియన్ వ్యూవ్స్ క్లబ్ చేరాయి.

ఈ లెక్కన చూసుకుంటే హిందీ మార్కెట్ లో రామ్ పోతినేని సినిమాలకు మంచి ఆదరణ అయితే ఉంది. ఇది కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితం అవుతుందా లేదంటే థియేటర్స్ కి వచ్చి కూడా ఆయన సినిమాలు చూస్తారా అనేది తెలియాల్సి ఉంది. పూరి జగన్నాథ్ కి కూడా బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా ఖచ్చితంగా హిందీ స్టేట్స్ లో సక్సెస్ అందుకుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.