Begin typing your search above and press return to search.

కోహ్లీ బ‌యోపిక్ కి రెడీగా ఉన్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్!

అంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఓ ఇంట‌ర్వ్యూలో కొహ్లీ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 12:30 PM GMT
కోహ్లీ బ‌యోపిక్ కి రెడీగా ఉన్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్!
X

విరాట్ కొహ్లీ బ‌యోపిక్ లో ఛాన్స్ కోసం కొంత మంది బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్, షాహిద్ క‌పూర్, విక్కీ కౌశ‌ల్, జాన్ అబ్ర‌హాం లాంటి హీరోలు ఇప్ప‌టికే ఓపెన్ అయ్యారు. అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తామ‌ని..అత‌డి జీవిత క‌థ ఎంతో స్పూర్తిగా ఉంటుంద‌ని...అలాంటి పాత్ర‌లు అరుదుగా వ‌స్తాయ‌ని న‌టించ‌డానికి రెడీగా ఉన్నారు.

మ‌రి టాలీవుడ్ నుంచి ఏ హీరో అయినా సిద్దంగా ఉన్నాడా? విరాట్ అంత‌గా ఏ టాలీవుడ్ స్టార్ నైనా ఇన్ స్పైర్ చేసాడా? అంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఓ ఇంట‌ర్వ్యూలో కొహ్లీ బ‌యోపిక్ లో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించాడు. విరాట్ కొహ్లీకి ...నాకు ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయ‌ని కొంద‌రు అంటుంటారు. ఒక‌వేళ అత‌డి బ‌యోపిక్ అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తా.

సాధార‌ణ జీవితం నుంచి అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్ గా అత‌డు ఎదిగిన వైనం ఎంతో స్పూర్తి దాయకంగా ఉంటుంది. అలాంటి పాత్ర‌లు చేయ‌డానికి ఛాలెంజింగ్ గా ఉంటుంది. తెలుగులో ఆ త‌ర‌హా సినిమాలు ఎక్కువ‌గా రావాలి. ఆడియ‌న్స్ కూడా చాలా మారారు. క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చూడటానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌లేదు కొత్త ద‌నం కోరుకుంటున్నారు. ఏక‌థ‌లోనైనా ఎమోష‌న్ కీల‌కం. అలాంటి క‌థ‌లు ఇప్పుడు అవ‌స‌రం' అని అన్నాడు.

ఇటీవేల రామ్ న‌టించిన 'డ‌బుల్ ఇస్మార్ట్' ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంక‌ర్' కి సీక్వెల్ గా పూరి జ‌గ‌న్నాద్ తెర‌కెక్కించిన సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవ‌డంలో చ‌తికిల ప‌డింది. దీంతో రామ్ ఖాతాలో మ‌రో ప్లాప్ న‌మోదైంది.