Begin typing your search above and press return to search.

స్కంద.. కొత్త ట్రైలర్, కొత్త స్ట్రాటజీ!.

రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబో మూవీ స్కంద ట్రైలర్ రీసెంట్ గా రిలీజైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:24 AM GMT
స్కంద.. కొత్త ట్రైలర్, కొత్త స్ట్రాటజీ!.
X

రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబో మూవీ స్కంద ట్రైలర్ రీసెంట్ గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచార చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సినీ ప్రియుల్లో పాజిటివ్ కన్నా ఎక్కువగా నెగిటివిటీ కనిపించింది. దీంతో అభిమానులు మరో కొత్త ట్రైలర్ ను కట్ చేసి రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

ఈ ప్రచార చిత్రంలో రామ్ లుక్స్, డైలాగ్స్, బోయపాటి మార్క్ యాక్షన్ బాగుందంటూనే.. వారిద్దరి గత సినిమాలతో ఈ ట్రైలర్ ను పోలుస్తున్నారు. జయ జానకి నాయక, సరైనోడు, అఖండ.. ఇలా తన సినిమాల్లోని సీన్స్ ను బోయపాటి స్కందలో చూపించారని, అలానే రామ్ ఇస్మార్ట్ శంకర్ మ్యానరిజమ్స్ కనిపించాయంటున్నారు. ఇక శ్రీలీల-రామ్ కాంబో సీన్స్ బావుందంటూనే.. వినయ విధేయరామలోని చరణ్-కియారా కెమిస్ట్రీని చూపించారని అంటున్నారు.

మొత్తంగా హీరో విలన్ సవాళ్లు విసురుకోవడం, టెంపుల్ బ్యాక్ డ్రాప్ వైలెంట్ ఫైట్స్, క్లైమాక్స్ లో రగ్డ్ లుక్ పవర్ ఫుల్ ఫైటింగ్.. ఇలా అన్నీ సన్నీవేశాలు ఫ్యాన్స్, జనరల్ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాయనే టాక్ వినిపిస్తోంది. పాత సినిమాల్లోని అక్కడక్కడా ముక్కలనింటినీ అతికించినట్టుగా స్కంద ట్రైలర్ ఉందని, ఎమోషన్స్ కనిపించలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాబట్టి కాబట్టి రొటీన్ స్టంట్ ఎపిసోడ్స్, మాక్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ తీసేసి సెన్సిబుల్, ఇంట్రెస్టింగ్ షాట్స్ తో డీసెంట్ ట్రైలర్ ను కట్ చేసి విడుదల చేయాలని, అప్పుడే జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసి సినిమాపై పాజిటివిటీ హైప్ క్రియేట్ చేయొచ్చని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అలానే స్కంద మూవీటీమ్ ఓ షాకింగ్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రీమియర్స్ వేయకూడదని అనుకుంటున్నారట. ఎందుకంటే ఇండియాలో తొలి షో ప్రారంభ సమయానికి మంచి ముహూర్తం పెట్టుకున్నారట. అందుకే ఆ ముహూర్తంలోనే ఫస్ట్ షో ప్రారంభం అవ్వాలని, సెంటిమెంట్ నేపథ్యంలో యూస్ ప్రీమియర్స్ రద్దు చేయాలని అనుకుంటున్నారట. అలాగే యూఎస్ బాక్సాఫీస్ ప్రీమియర్స్ కన్నా ఇండియాలోని మొదటి షో టాక్ రివ్యూస్ పైనే సినిమా రిజల్ట్, మార్కెట్ ఆధారపడి ఉంటుందని బోయపాటి భావిస్తున్నారట.