స్కంద బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?
రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కి సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రానున్న పాన్ ఇండియా మూవీ స్కంద.
By: Tupaki Desk | 24 Sep 2023 4:10 AM GMTరామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కి సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రానున్న పాన్ ఇండియా మూవీ స్కంద. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. మూవీ బిజినెస్ పరంగా కూడా రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్స్ స్కంద సినిమాకి సెట్ అయ్యాయి. ఓవరాల్ గా 48.25 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందంట. రామ్ రెగ్యులర్ మార్కెట్ కి మించి స్కంద బిజినెస్ అయ్యిందని చెప్పొచ్చు.
నైజాం ఏరియా హక్కులని దిల్ రాజు 14 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. సీడెడ్ హక్కులు ఎస్ఆర్ఆర్ ఫిలిం 9 కోట్లకి దక్కించుకుంది. ఇక ఆంధ్రా హక్కుల కోసం చిత్ర నిర్మాత 25 కోట్ల వరకు డిమాండ్ చేశారు. అయితే రామ్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో డిస్టిబ్యూటర్స్ అంత ఇవ్వడానికి ముందుకి రాలేదు. ఫైనల్ గా 20 కోట్లకి డీల్ క్లోజ్ అయ్యింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ 43 కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా రామ్ కెరియర్ లో బెస్ట్ డీల్ స్కంద మూవీకి జరిగింది. ఏకంగా 2.25 కోట్లకి హక్కులు సొంతం చేసుకున్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల వరకు తెలుగు వెర్షన్ పైన బిజినెస్ జరిగిందంట. మొత్తం 48.25 కోట్ల వరకు బిజినెస్ లెక్కలు తేలినట్లు సమాచారం.
దీంతో 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మూవీ థియేటర్స్ లోకి సెప్టెంబర్ 28న అడుగుపెడుతోంది. ఎక్స్ పెక్టేషన్స్ ఎలాగూ హై ఎండ్ లో ఉన్నాయి కాబట్టి మంచి ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మూవీ పబ్లిక్ టాక్ బట్టి లాంగ్ రన్ ఎంత వరకు నిలబడుతుంది. ఎన్ని కోట్లు సాధించే ఛాన్స్ ఉంటుందనేది డిసైడ్ అవుతుంది.
సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు. అఖండ సినిమాకి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు స్కంద విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. రామ్ పోతినేని కూడా ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.