Begin typing your search above and press return to search.

హీరో పూలు పంపడంతో 'బేబీ' ఫుల్‌ హ్యాపీ

తాజాగా ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ కూడా బేబీ హీరోయిన్‌ వైష్ణవికి పూల బొకే పంపించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   26 July 2023 7:01 AM GMT
హీరో పూలు పంపడంతో బేబీ ఫుల్‌ హ్యాపీ
X

'బేబీ' సినిమా విడుదల అయ్యి రెండు వారాలు కాబోతున్నా కూడా జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే చిన్న సినిమాల్లో బాహుబలి రేంజ్ వసూళ్లు దక్కించుకున్న బేబీ ముందు ముందు మరింత భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కలెక్షన్స్ తో ప్రేక్షకులు బేబీని ఆదరిస్తూ ఉంటే.. ఇండస్ట్రీ ప్రముఖులు బేబీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇటీవలే అల్లు అర్జున్‌ స్వయంగా ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేసి బేబీ యూనిట్‌ సభ్యులను అభినందించిన విషయం తెల్సిందే. ఇంకా ఎంతో మంది హీరోయిన్ వైష్ణవి చైతన్య ను ప్రత్యేకంగా అభినందించిన తో పాటు.. ఆమెను తమ సినిమాల్లో నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం అందుతోంది.

మొత్తానికి వైష్ణవి చైతన్య 'బేబీ' పాత్ర తో మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఎనర్జిటిక్ స్టార్‌ రామ్ కూడా బేబీ హీరోయిన్‌ వైష్ణవికి పూల బొకే పంపించి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఈ విషయాన్ని వైష్ణవి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. పూల బొకే పంపించి బేబీ యూనిట్‌ సభ్యులను అభినందించినందుకు గాను రామ్‌ కు వైష్ణవి కృతజ్ఞతలు తెలియజేసింది.

రామ్‌ ప్రస్తుతం బోయపాటి సినిమాతో పాటు పూరి సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. రెండు సినిమాలు చేస్తున్న రామ్‌ 'బేబీ' సినిమాను చూసి ప్రత్యేకంగా హీరోయిన్‌ కు పూల బొకే పంపించి యూనిట్‌ సభ్యులందరినీ కూడా అభినందించాడు.