ఆ జోన్ దాటి రాలేకపోతున్న రామ్..!
అందుకు రామ్ ఎంచుకుంటున్న కథలు ప్రధాన కారణం కావొచ్చు.. కానీ రామ్ ఆ సేఫ్ జోన్ దాటి రాలేకపోతున్నాడు అన్నది గుర్తించాల్సిన విషయం.
By: Tupaki Desk | 31 March 2024 4:43 AM GMTమరో రెండేళ్లలో రెండు దశాబ్దాల కెరీర్ ను పూర్తి చేసుకోబోతున్న ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ కెరీర్ పరంగా హిట్లు ఫ్లాపులను సమతూకం చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ తన రేంజ్ మాత్రం పెంచుకోవట్లేదని చెప్పొచ్చు. కెరీర్ మొదట్లో తన మార్క్ సినిమాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన రామ్ కొన్నాళ్లుగా అదే పంథా కొనసాగిస్తున్నా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ప్రయత్నం చేయట్లేదు. అందుకు రామ్ ఎంచుకుంటున్న కథలు ప్రధాన కారణం కావొచ్చు.. కానీ రామ్ ఆ సేఫ్ జోన్ దాటి రాలేకపోతున్నాడు అన్నది గుర్తించాల్సిన విషయం.
స్టార్ హీరో తరహాలో మాస్ సినిమాలు చేయాలన్న ఆలోచన మంచిదే కానీ ప్రస్తుతం హీరోలంతా కొత్త కథలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాలని చూస్తున్నారు. మూస కథలను.. సినిమాలను ఆడియన్స్ ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి సినిమా సినిమాకు రిస్క్ చేయడానికైనా రెడీ అనేస్తున్నారు కొందరు హీరోలు. రామ్ మాత్రం తనకు సూటయ్యే రెగ్యులర్ కథలనే చేస్తూ వస్తున్నాడు. తన మాస్ పంథా కొనసాగించడం వరకు ఓకే కానీ మారిన ఆడియన్స్ మైండ్ సెట్ ప్రకారం రామ్ కూడా కొత్త కథలతో వస్తే బాగుంటుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇస్మార్ట్ శంక కి నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ నెస్ తో ఉంటుంది. పూరీ రామ్ కలిసి మరోసారి వారి హిట్ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. టైర్ 2 హీరోలైన నాని, రవితేజ లాంటి వారు ప్రేక్షకులకు కొత్త కథ చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటే రామ్ మాత్రం ఆ రిస్క్ చేసేందుకు ఆసక్తిగా కనిపించడం లేదు. తన దగ్గరకు అలాంటి కథలు రావట్లేదా లేదా రామ్ కావాలని అలాంటి సినిమాలు వద్దనుకుంటున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
రామ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో కూడా ప్రయోగాలు చేయాలని కోరుతున్నారు. దసరా టైపులో పీరియాడికల్ మూవీ ఇదివరకు రామ్ అటెంప్ట్ చేయని జోనర్ లో సినిమాలు చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. తనకంటూ ఒక సెపరేట్ స్టైల్, ఇమేజ్ సంపాదించిన రామ్ ఇలా సెటిల్డ్ గా సినిమాలు చేస్తూ వెళ్తే కెరీర్ కచ్చితంగా రిస్క్ లో పడే ఛాన్స్ ఉంటుంది. మరి రామ్ ఈ విషయాన్ని గుర్తించి రాబోయే సినిమాలతో అయినా మార్పు చేస్తాడేమో చూడాలి.