ఢిల్లీ నుంచి కాకినాడ తీరానికి చేరుతారా?
# ఆర్సీ 16 షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
By: Tupaki Desk | 28 Feb 2025 4:00 PM IST# ఆర్సీ 16 షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ సహా ప్రధాన తారాగణమంతా షూట్ లో పాల్గొంటున్నారు. ఈ వారం తో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. తదుపరి షెడ్యూల్ రాజధాని ఢిల్లీలో మొదలవుతుంది. అక్కడ రెజ్లింగ్ కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
ఇందులో చరణ్ సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. అక్కడ కొన్ని రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ చేస్తారని సమాచారం. కుస్తీకి సంబంధించిన సన్నివేశాలకు ఢిల్లీకి సంబంధం ఉండటంతోనే బుచ్చిబాబు ప్రత్యేకంగా ప్లాన్ చేసి ఢిల్లీకి వెళ్తున్నాడు. అయితే ఇదే షెడ్యూల్ లో భాగంగా ఆ సన్ని వేశాలకు కంటున్యూటీగా కాకినాడలో కూడా మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.
కాకినాడలో ఉప్పాడ బీచ్ సమీపంలో ఈ సన్నివేశాలకు సంబంధించి షూట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. కాకినాడకు సంబంధించిన సన్నివేశాలు ప్లాష్ బ్యాక్ లో వస్తాయని మేకర్స్ నుంచి లీకులందుతున్నాయి. అవి ఎంతో సాహసోపేతంగా ఉంటాయని వినిపిస్తుంది. మొత్తానికి బుచ్చిబాబు తన స్థానిక ప్రాంతమైన కాకినాడ ఉప్పాడను మరో సారి తన సినిమాలో హైలైట్ చేయడం విశేషం.
తొలి చిత్రం `ఉప్పెన`లో చాలా భాగం షూటింగ్ ఉప్పాడ సమీపంలోనే చేసారు. ఆసినిమా మంచి విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు రెండవ సినిమా విషయంలోనూ బీచ్ నేపథ్యాన్ని ఎంపిక చేసుకుని అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో చరణ్ అండ్ కో కాన్పిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.