Begin typing your search above and press return to search.

వివాహ బంధంలోకి ర‌మ్య బెహ‌రా-అనురాగ్ కుల‌క‌ర్ణి!

టాలీవుడ్ సింగ‌ర్లు రమ్య బెహ‌రా- అనురాగ్ కుల‌క‌ర్ణి ప్రేక్ష‌కులంద‌రికీ సుప‌రిచిత‌మే. తాజాగా వారిద్ద‌రు వివాహం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   16 Nov 2024 6:28 AM GMT
వివాహ బంధంలోకి ర‌మ్య బెహ‌రా-అనురాగ్ కుల‌క‌ర్ణి!
X

టాలీవుడ్ సింగ‌ర్లు రమ్య బెహ‌రా- అనురాగ్ కుల‌క‌ర్ణి ప్రేక్ష‌కులంద‌రికీ సుప‌రిచిత‌మే. తాజాగా వారిద్ద‌రు వివాహం చేసుకున్నారు. హైద‌రాబాద్ లో ఈ వేడుక ఇరు కుటుంబాల పెద్ద‌లు, ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు గాయ‌నీ, గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కుల స‌మ‌క్షంలో ఈవేడుక జ‌రిగింది. అయితే వీరి వివాహం జ‌రుగుతున్న‌ట్లు ముందుగా ఎలాంటి వార్త‌లు రాలేదు. ఒక్క‌సారిగా వారి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో అంతా స‌ర్ ప్రైజ్ అవుతున్నారు.

ఇది ప్రేమ వివాహ‌మా? పెళ్లి వివాహ‌మా? అన్న‌ది త్వ‌ర‌లో క్లారిటీ వ‌స్తుంది. ఈ పెళ్లి గురించి ఇంకా ర‌మ్య‌గానీ, కుల‌క‌ర్ణిగానీ స్పందించ‌లేదు. అయితే న‌వ‌దంప‌తుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రిటీలు, అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇక ఇద్ద‌రు క‌లిసి జంట‌గా కొన్ని సినిమాల్లో పాట‌లు పాడారు. ఇప్పుడు రియ‌ల్ లైఫ్ లో క‌లిసారు. ఇక‌పై భార్య భ‌ర్త‌లుగా క‌లిసి పాడ‌నున్నారు.

అనురాగ్ కుల‌క‌ర్ణి దికామారెడ్డి. ` సూప‌ర్ సింగ‌ర్ `ఈవెంట్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌మ‌య్యాడు. ఇందులో విజేత‌గా నిల‌వ‌డంతో గాయ‌కుడిగా సినిమాల‌కు పాడే అవ‌కాశం వ‌చ్చింది. `శ‌త‌మానం భ‌వ‌తిలో `మెల్ల‌గా తెల్లారిందో`, కాట‌మ‌రాయుడులో `మీరా మీరా మీసం`, పైసా వ‌సూల్ లో టైటిల్ సాంగ్, ఇస్మార్ట్ శంక‌ర్ లో `ఉండిపో ఉండిపో` పాట‌లు స‌హా చాలా సినిమాల్లో పాట‌లు పాడాడు.

ఇక ర‌మ్య బెహ‌రా గురించి కొత్త‌గా ప‌రిచయం అవ‌స‌రం లేదు. గాయ‌నిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. కీర‌వాణి ఆమెని సినిమా గాయ‌నిగా ప‌రిచ‌యం చేసారు. బాహుబ‌లి లో `ధీవ‌ర` పాట ఆమెకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. వీట‌న్నింటిని మించి అంద‌మైన సింగ‌ర్ గా ఎంతో ఫేమ‌స్. సోష‌ల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తిరుప‌తి దేవస్థానంలో ఆమె పాట‌ల‌తో భ‌క్తుల్ని అలరిస్తుంటారు.