రష్మికను ట్రోల్ చేస్తున్న వారికి నటి రమ్య స్ట్రాంగ్ కౌంటర్
అలాంటి ఆమెపై సొంత రాష్ట్రం వాళ్లే విమర్శలు చేస్తూ నిప్పులు కక్కుతున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 2:15 PMనేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. భాష పట్టింపులు లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రష్మిక కర్ణాటకకు చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. అలాంటి ఆమెపై సొంత రాష్ట్రం వాళ్లే విమర్శలు చేస్తూ నిప్పులు కక్కుతున్నారు. రీసెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రష్మికపై తీవ్రంగా ఫైర్ అయిన విషయం తెలిసిందే.
రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ వల్ల కర్ణాటకలో ఆమెపై ఎవరూ ఊహించని రీతిలో ట్రోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో కన్నడ నటి రమ్య రెస్పాండ్ అయి, ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నటిగా, పొలిటీషియన్ గా సౌత్ ఆడియన్స్ కు సుపరిచితురాలైన రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ తో కలిసి అభిమన్యు సినిమా చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో కనిపించలేదు.
రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఇకనైనా ఆపండని, ఆమెను ఇక టార్చర్ చేయొద్దని కోరింది. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన రమ్య, రష్మిక లాంటి హీరోయిన్లను ట్రోల్ చేయడం మానవత్వం అనిపించుకోదని, ఆడపిల్లలు చాలా సున్నితంగా ఉంటారని, ఏమన్నా సరే తిరిగి మాట్లాడరు కాబట్టి వారిని హింసించడం కరెక్ట్ కాదని రమ్య చెప్పుకొచ్చింది.
సినిమాల్లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ మహిళలకు అన్యాయం జరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా మనమంతా ఒకటి కావాలని రమ్య పిలుపునిచ్చింది. రష్మికకు సపోర్ట్ గా రమ్య మాట్లాడటంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే రష్మిక రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తనది హైదరాబాద్ అని చెప్పడంతో కన్నడిగులు రగిలిపోయి రష్మికపై నెక్ట్స్ లెవెల్ లో విమర్శలు చేస్తున్నారు.