రమ్యకృష్ణ ఆ నిర్ణయం తీసుకుంటే.. నీలాంబరి మిస్ అయ్యేదిగా..!
ఐతే డైరెక్టర్ ముందు తన దగ్గరకు వచ్చి నీలాంబరి కావాలా.. సౌందర్య పాత్ర కావాలా అని అడిగి ఉంటే సౌందర్య పాత్ర చేస్తానని చెప్పేదాన్ని అని ఆమె ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
By: Tupaki Desk | 30 Nov 2024 3:30 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రదారులుగా నటించిన సినిమా నరసింహ. కె.ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర అప్పటి వరకు ఉన్న రమ్యకృష్ణ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా స్టార్స్ తో కలిసి నటించిన రమ్యకృష్ణ నీలాంబరి పాత్రతో ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.
రజినికి ప్రతినాయకురాలిగా రమ్యకృష్ణ చూపించిన అభినయం ఆడియన్స్ ని ఫిదా చేసింది. ఆ సినిమ చూసిన తర్వాత కొందరు నిజంగానే రమ్యకృష్ణను అసహ్యించుకున్నారు అంటే ఆమె ఏ రేంజ్ లో నటించిందో అర్ధం చేసుకోవచ్చు. ఐతే నరసింహ సినిమాలో తనకు నీలాంబరి పాత్ర ఇచ్చినప్పుడు ముందు ఆ పాత్రని చేయాలని అనుకోలేదట రమ్యకృష్ణ. తల పొగరుతో ఉన్న ఆ పాత్ర కాస్త కష్టంగా అనిపించింది. అది ఎంత సినిమా అయినా కూడా చేయాలనిపించలేదు.
ఐతే డైరెక్టర్ ముందు తన దగ్గరకు వచ్చి నీలాంబరి కావాలా.. సౌందర్య పాత్ర కావాలా అని అడిగి ఉంటే సౌందర్య పాత్ర చేస్తానని చెప్పేదాన్ని అని ఆమె ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఒక సీన్ లో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ కాస్త ఇబ్బందిగా అనిపించిందని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.
రమ్యకృష్ణ అప్పట్లో ఆ పాత్ర చేయబట్టే ఆమెకు మరిన్ని పాత్రలు రాగలిగాయి. దర్శకుడి విజన్ నమ్మి నీలాంబరిగా చేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత చాలా అవకాశాలు అందుకుంది. అంతేకాదు శివగామిగా బాహుబలి సినిమాలో ఆ గాంభీర్యం హుందాతనం ఇదంతా కూడా రమ్యకృష్ణ వెరైటీ పాత్రలు చేయడం వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు.
ఒకవేళ నీలాంబరిగా రమ్యకృష్ణ చేయకపోయుంటే మాత్రం కచ్చితంగా ఆమెలోని ఈ నెగిటివ్ యాంగిల్ ప్రొజెక్ట్ అయ్యేది కాదు. తెర మీద రమ్యకృష్ణ విలనిజం సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. నీలాంబరి పాత్ర సక్సెస్ అవ్వడంతో రమ్యకృష్ణ అప్పటి నుంచి వెరైటీ పాత్రలను కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. సౌత్ ఆడియన్స్ ను ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్న రమ్యకృష్ణ ఇప్పటికీ సరైన పాత్ర వస్తే మాత్రం అదరగొట్టేయడం ఖాయమని బాహుబలిలో శివగామి పాత్ర ద్వారా చెప్పకనే చెప్పారు. బాహుబలి తర్వాత మళ్లీ రమ్యకృష్ణకు స్పెషల్ రోల్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ మహేష్ మదర్ గా చేసి మెప్పించారు.