Begin typing your search above and press return to search.

నీలాంబ‌రి అప్ప‌టి నాట్య‌మ‌యూరి ఇలా!

తాజాగా సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఓ త్రో బ్యాక్ పిక్ ని షేర్ చేసారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ నాట్య‌మ‌యూరి లుక్ లో నాట్యం చేస్తోన్న పిక్ అది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 1:09 PM GMT
నీలాంబ‌రి అప్ప‌టి నాట్య‌మ‌యూరి ఇలా!
X

ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఒక్క‌సారి గ‌తంలోకి తొంగి చూస్తే ఎన్నో జ్ఞాప‌కాలుంటాయి. అవి తీపి జ్ఞాప‌కాలు అవ్వొచ్చు.. చేదు జ్ఞాప‌కాలు అవ్వొచ్చు. అలాంటివ‌న్నీ ఒక్క‌సారిగా మ‌దిలో మెదిలితో వాటిని పంచుకోవాలి అన్న ఆస‌క్తి రెట్టింపు అవుతుంది. ఇంకే ముంది వెంట‌నే సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేస్తే స‌రి. ఇప్పుడిదే ట్రెండ్ ఇది. పాత ఫోటోలు..జ్ఞాప‌కాల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుని ఆనాటి రోజుల్లోకి జారుకుంటోన్న‌ స‌మ‌య‌మిది.

తాజాగా సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ ఓ త్రో బ్యాక్ పిక్ ని షేర్ చేసారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ నాట్య‌మ‌యూరి లుక్ లో నాట్యం చేస్తోన్న పిక్ అది. అందులో ర‌మ్య‌కృష్ణ వ‌య‌సు 20 ఏళ్ల లోపే ఉంటుందేమో. నాట్యం దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబై నాట్యం చేస్తోంది. అది బ్లాక్ అండ్ వైడ్ పిక్. ఇప్ప‌టి ర‌మ్య‌కృష్ణ‌తో ఏమాత్రం పోలిక లేదు. ఇప్పుడు ర‌మ్య‌కృష్ణ వ‌య‌సు 50 ఏళ్లు పైనే. ఆమె 13 ఏళ్ల వ‌య‌సులోనే మ్యాక‌ప్ వేసుకుంది.

'వెల్లై మనసు' సినిమాతో తమిళ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 1990 -2000. ఈ ప‌దేళ్ల గ్యాప్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితోనూ సినిమాలు చేసారు. సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించారు. ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించారు.

సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ అమ్మ‌, అత్త‌, ఒదిన‌, అక్క‌, చెల్లి పాత్ర‌ల్లో త‌న‌దైన ముద్ర వేసారు. ఇక బాహుబ‌లితో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యారు. శివ‌గామి పాత్ర ఆమె ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చి పెట్టింది. కానీ ఆ త‌ర్వాత అదే త‌ర‌హా పాత్ర‌లు రాలేదు. మొత్తంగా ఆమె కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ 200 పైగా సినిమాల్లో న‌టించారు.