Begin typing your search above and press return to search.

ఆయ‌న పిలుపు కోసం శివ‌గామి వెయిటింగ్!

'బాహుబ‌లి' లో శివ‌గామి త‌ర్వాత వెట‌ర‌న్ న‌టి ర‌మ్య‌కృష్ణ కి ఆ రేంజ్ రోల్ ప‌డ‌లేదు.

By:  Tupaki Desk   |   15 May 2024 11:30 PM GMT
ఆయ‌న పిలుపు కోసం శివ‌గామి వెయిటింగ్!
X

'బాహుబ‌లి' లో శివ‌గామి త‌ర్వాత వెట‌ర‌న్ న‌టి ర‌మ్య‌కృష్ణ కి ఆ రేంజ్ రోల్ ప‌డ‌లేదు. సినిమాలైతే చేస్తున్నారు గానీ ఏ పాత్ర ఆమె ఇమేజ్ ని మాత్రం మ్యాచ్ చేయ‌లేక‌పోతున్నాయి. 'శైలజా రెడ్డి అల్లుడు' .. 'బంగార్రాజు' .. 'రిపబ్లిక్' .. 'రంగమార్తాండ' .. 'గుంటూరు కారం' లాంటి సినిమాలు చేశారు. కానీ అవేవి ర‌మ్య‌కృష్ణ న‌ట విశ్వ‌రూపం చూపించే రోల్స్ కాదు. `రిప‌బ్లిక్` లో ప‌వ‌ర్ పుల్ రోల్ పోషించినా అది రీచ్ అవ్వ‌క‌పోవ‌డంతో ఎఫెర్ట్ అంతా వృధా ప్ర‌య‌త్నంగానే మిగిలిపోయింది.

దీంతో ర‌మ్య‌కృష్ణ స‌రైన రోల్ కోసం ఎదురు చూస్తున్న స‌మ‌య‌మిది. అవ‌కాశాలైతే వ‌స్తున్నాయిగానీ ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఏ సినిమాకి సైన్ చేయ‌లేదు. శివ‌గామి రేంజ్ రోల్ తో ఎవ‌రైనా వ‌స్తారా? అని ఆస‌క్తిక‌రంగా చూస్తున్నారు. మ‌రి అది సాధ్య‌మ‌వుతుందో? లేదో తెలియ‌దు గానీ! ద‌గ్గ‌ర లో ఓ ఛాన్స్ మాత్రం క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ ని సైతం షేక్ చేసేలా రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. రాజ‌మౌళి సినిమాలంటే వీలైనంత వ‌ర‌కూ తెలుగు న‌టుల్నే తీసుకుంటారు. అందులోనే ఫీమేల్ ఆర్టిస్టుల‌కు ఇక్క‌డి వారికే ప్రాధాన్య‌త ఇస్తారు. హీరోయిన్లు....యాక్ష‌న్ త‌ర‌హా పాత్ర‌లుంటే ఇంత‌ర భాష‌ల‌కు వెళ్తారు త‌ప్ప లేదంటే? ఇక్క‌డి ట్యాలెంట్ తో ప్ర‌పంచాన్ని ఏలాల‌ని చూసే వ్య‌క్తి జ‌క్క‌న్న‌. కాబ‌ట్టి ర‌మ్య‌కృష్ణ కి ఆయ‌న సినిమాలో ఏదైనా రోల్ ఇవ్వ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు.

`బాహుబలి `త‌ర్వాత `ఆర్ ఆర్ ఆర్` తెర‌కెక్కించారు. అందులో ర‌మ్య‌కృష్ణ పోషించే పాత్ర అంటూ లేదు. మ‌రి మ‌హేష్ సినిమాలోనైనా మ‌హిళా న‌టి పోషించే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఏదైనా ఉందా? ఉంటే అది ర‌మ్య‌కృష్ణ కి ఇస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం ఆసినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఆ ప్రాజెక్ట్ వివ‌రాలేవి ఎక్క‌డా లీక్ అవ్వ‌కుండా జ‌క్క‌న్న అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

( బాహుబ‌లి త‌ర్వాత ఆ రేంజ్ రోల్ ప‌డ‌లేదు. పాన్ ఇండియాలో గుర్తింపు కు కార‌ణం రాజ‌మౌళి. మ‌రి తాజా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. వ‌స్తే లక్కీ)