Begin typing your search above and press return to search.

'విశ్వంభర' : చిరుతో ఆమె 50 రోజుల షూట్‌

అక్టోబర్‌ లేదా నవంబర్‌ లో షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   24 Aug 2024 12:30 AM GMT
విశ్వంభర : చిరుతో ఆమె 50 రోజుల షూట్‌
X

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా జరుగుతోంది. అక్టోబర్‌ లేదా నవంబర్‌ లో షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. 2025 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభర హీరోయిన్‌ అనగానే త్రిష పేరు వినిపిస్తుంది. త్రిష తో చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నాడని, వీరిద్దరి కాంబో కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

తాజాగా హీరోయిన్‌ రమ్య పసుపులేటి ఒక మీడియా చిట్‌ చాట్‌ లో మాట్లాడుతూ ప్రస్తుతం తాను మ్యాడ్‌ 2 సినిమాతో పాటు విశ్వంభర సినిమాలో చిరంజీవితో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. విశ్వంభర సినిమా కోసం తాను ఏకంగా 40 రోజుల షూట్ చేశాను, ఇంకో 10 రోజుల షూట్‌ లో పాల్గొనాల్సి ఉంది. సినిమా మొత్తంలో కూడా చిరంజీవి గారి పక్కనే నేను ఉంటాను. ఆయనతో ఏకంగా మూడు పాటలు నాకు ఉంటాయని, ఆయనతో డాన్స్ చేసే అవకాశం కూడా దక్కిందని ఆ చిట్‌ చాట్‌ లో హీరోయిన్‌ రమ్య పసుపులేటి చేసిన వ్యాఖ్యలు అందరికి సర్‌ప్రైజింగ్‌ గా ఉన్నాయి.

హీరోయిన్‌ గా త్రిష నటిస్తూ ఉండగా రమ్య పసుపులేటి కి చిరంజీవి తో అంతటి సన్నివేశాలు ఎలా సాధ్యం అంటూ ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. రమ్య పసుపులేటి మాత్రమే కాకుండా ఇంకా పలువురు చిన్న హీరోయిన్స్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే రమ్య చెబుతున్న దాని ప్రకారం ఆమె చెల్లి పాత్రలో కాకుండా అంతకు మించి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు రమ్య పాత్ర ఏంటి, ఆమె పాత్ర త్రిష పోషిస్తున్న హీరోయిన్‌ పాత్ర కంటే కీలకంగా ఉంటుందా అనేది చూడాలి.

బింబిసార చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు వశిష్ట అదే తరహా ఫాంటసీ కథాంశంను తీసుకుని, చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లు కథను రూపొందించినట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కు ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరంజీవి ని చాలా విభిన్నమైన పాత్రలో చూడబోతున్నామని, తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. చిరు గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై కాస్త ఎక్కువ దృష్టి పెడుతున్నారు.