Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ రానా కి విల‌న్ బాధ్య‌త‌లా జ‌క్క‌న్నా?

టాలీవుడ్ లో రానా ఎలాంటి పాత్ర‌లైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయ‌గల్గుతున్నాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 3:30 PM GMT
మ‌ళ్లీ రానా కి విల‌న్ బాధ్య‌త‌లా జ‌క్క‌న్నా?
X

టాలీవుడ్ లో రానా ఎలాంటి పాత్ర‌లైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయ‌గల్గుతున్నాడు. పాత్ర న‌చ్చిందంటే భాష‌తో సంబంధం లేకుండా దూసుకుపోతాడు. అయితే అత‌డు ఎలాంటి పాత్ర‌లు పోషించినా...హీరో గా న‌టించినా, విల‌న్ పాత్ర‌ల ద్వారా వ‌చ్చిన గుర్తింపు మాత్రం ఎంతో ప్ర‌త్యేకం. అందుకే భ‌ల్లాల దేవ‌గా ప్ర‌పంచాన్ని మెప్పించ‌గ‌లిగాడు. భ‌ల్లాల దేవ లాంటి పాత్ర‌లు పోషించాలి అంటే రానా మాత్ర‌మే స‌రితూగుతాడు? అనే ముద్ర‌వేసుకున్నాడు.

ఇటీవ‌ల రిలీజ్ అయిన వెట్టేయాన్ లో విల‌న్ గా మెప్పించాడు. అందులో రానా పెర్మార్మెన్స్ ఎంతో ప్రోఫెష‌న‌ల్ గా ఉంది. తెర‌పై క‌నిపించింది కాసేపే అయినా ఓ వైబ్ ని తీసుకొచ్చిన రోల్ అది. రానాని ఆ పాత్ర‌లో చూసిన త‌ర్వాత హీరోగా కంటే ఇలాంటి పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాడు అనే భ‌రోసా రెట్టింపు అయింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో రానా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఎస్ ఎస్ ఎంబీ 29 లో రానా విల‌న్ గా ఎంపిక‌య్యాడు? అనే ఓ వార్త ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తుంది.

ఇందులో రానా ఆఫ్రికాలోని మ‌సాయి తెగ‌కు చెందిన కీల‌క స‌భ్యుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. రాజ‌మౌళి కోరిక మేర‌కే రానా ఇందులో భాగ‌మ‌వుతున్నాడ‌ని అంటున్నారు. అత‌డి పాత్ర అత్యంత కర్క‌శంగా ఉండ‌బోతుందిట‌. అత‌డి గెట‌ప్ స‌హా ప్ర‌తీది ఓ కొత్త లుక్ లో హైలైట్ అవుతుంద‌ని లీకులందుతున్నాయి. రాజ‌మౌళి నిర్వ‌హిస్తోన్న వ‌ర్క్ షాపుల‌కు రానా కూడా హాజ‌ర‌వుతున్నాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.

మ‌రి ఇందులో నిజ‌మెంతో యూనిట్ ధృవీక‌రించాల్సి ఉంది. రానాకి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చిందంటే దానికి కార‌ణం రాజ‌మౌళి అన్న సంగ‌తి తెలిసిందే. భ‌ల్లాల దేవ పాత్ర‌తోనే అది సాధ్య‌మైంది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ చేసారు. కానీ అందులో ఛాన్స్ ఇవ్వ‌లేదు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ రానా అవ‌స‌రం ప‌డ‌టంతో అత‌డిని తెర‌పైకి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. పాత్ర కోసం రానా ఎలాంటి క‌ఠిన‌మైన శిక్ష‌ణ‌కైనా సిద్దంగా ఉంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు.