Begin typing your search above and press return to search.

రానా డ్రీమ్ ప్రాజెక్ట్‌ కేజీఎఫ్ నిర్మాత‌లు హైజాక్!

అయితే అత‌డు క‌ల‌లు క‌న్న కొన్ని ప్రాజెక్టులు ఎప్ప‌టికీ ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా రానా ద‌గ్గుబాటి కొన్నేళ్ల క్రితం `హిర‌ణ్య‌క‌శిప` పేరుతో సినిమాని ప్ర‌క‌టించారు కానీ ప‌ట్టాలెక్క‌లేదు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 4:14 AM GMT
రానా డ్రీమ్ ప్రాజెక్ట్‌ కేజీఎఫ్ నిర్మాత‌లు హైజాక్!
X

ద‌గ్గుబాటి రానా ఇటీవ‌ల సోలో హీరోగా ఫ్లాపుల్ని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ల్టీస్టార‌ర్ల‌లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించేందుకు ఎక్కువ‌గా మొగ్గు చూపాడు. మ‌రోవైపు బుల్లితెర- ఓటీటీ హోస్ట్ గాను రానా చెప్పుకోద‌గ్గ స్థాయిలో రాణిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం `ది రానా ద‌గ్గుబాటి షో` పేరుతో ఒక రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు.

అయితే అత‌డు క‌ల‌లు క‌న్న కొన్ని ప్రాజెక్టులు ఎప్ప‌టికీ ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా రానా ద‌గ్గుబాటి కొన్నేళ్ల క్రితం `హిర‌ణ్య‌క‌శిప` పేరుతో సినిమాని ప్ర‌క‌టించారు కానీ ప‌ట్టాలెక్క‌లేదు. పురాణేతిహాసాల్లోని ఒక అద్భుత‌మైన‌ క‌థ‌తో రానా ప్ర‌యోగాత్మ‌కంగా సినిమాని తెర‌కెక్కించాల‌ని క‌ల‌లు క‌న్నారు. దీనికోసం చాలా ప‌ని చేసారు. కొన్నేళ్ల పాటు యానిమేష‌న్ పై ప‌ని చేసినా కానీ ఎందుక‌నో ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు. అప్ప‌టికే ఎంపిక చేసిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ని ప్రాజెక్ట్ నుంచి తొల‌గించారు. త‌ర్వాత ఆ వివాదం స‌ద్ధుమ‌ణిగినా కానీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు.

నిజానికి `హిర‌ణ్య‌క‌సిప` చిత్రంలో న‌ర‌సింహావ‌తారంలో క‌నిపించాల‌ని రానా క‌ల‌లు క‌న్నాడు. కానీ అది వీలుప‌డ‌లేదు. కానీ ఇప్పుడు రానా క‌ల‌ల ప్రాజెక్ట్ ని కేజీఎఫ్ నిర్మాత‌లు హైజాక్ చేసారు. `మ‌హావ‌తార్ న‌ర‌సింహ` పేరుతో సినిమా చేస్తున్నారు. అశ్విన్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. దీనిని యానిమేటెడ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. `మహావతార్ నరసింహా` పేరుతో పోస్ట‌ర్లు టీజ‌ర్ విడుద‌ల కాగా మంచి స్పంద‌న వ‌చ్చింది. కేజీఎఫ్‌, కాంతార, భ‌గీర‌ త‌ర్వాత‌ హోంబాలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్టును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. హోంబ‌లోతో పాటు క్లీమ్ ప్రొడక్షన్స్ దీనికి పెట్టుబ‌డులు పెడుతోంది. ఈ యానిమేష‌న్ సిరీస్ లో విష్ణువు అవతారాల గురించి విజువ‌లైజ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో మ‌హావ‌తార్ న‌ర‌సింహా చిత్రం ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

కాంతార విజయం తర్వాత, భారతీయ సంస్కృతి నుండి ప్రేరణ పొందిన క‌థ‌ల‌తో సినిమాలు తీయాల‌ని ఆలోచించామ‌ని నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్ ప్ర‌క‌టించారు. నిజానికి న‌ర‌సింహ స్వామి క‌థ‌తో సినిమాని తెర‌కెక్కించాల‌నే ఆలోచ‌న సార్వ‌జ‌నీన‌మైనది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ డ‌యాస్పోరాలో స్వామి వారికి భ‌క్తకోటి విస్త‌రించి ఉంది. పురాణాల్లో నిక్షిప్త‌మైన చాలా అద్భుత‌మైన క‌థ‌లు ఇటీవ‌ల సినిమాలుగా రాక‌పోవ‌డం కూడా హోంబ‌లే ఫిలింస్ ప్ర‌ణాళిక‌కు క‌లిసొచ్చే అంశం. అయితే తెలుగు పురాణాల్లో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహస్వామి క‌థ ఎంతో విశిష్ఠ‌మైన‌ది. మ‌న‌వైన క‌థ‌ల్ని ఇరుగు పొరుగున‌ ఎన్ క్యాష్ చేస్తుంటే, తెలుగులోని అగ్ర‌నిర్మాత‌లు, ఫిలింమేక‌ర్స్ ఆ దిశ‌గా ఆలోచించ‌క‌పోవ‌డం శోచ‌నీయం.