మెగాస్టార్ చేతిలో దెబ్బలు తిన్నానన్న స్టార్ హీరో
అతడి ఆల్ రౌండర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 18 Nov 2024 3:45 AM GMTరానా దగ్గుబాటి మల్టీ ట్యాలెంటెడ్ స్టార్‌గా అందరికీ సుపరిచితుడు. బాహుబలి భళ్లాల దేవగా దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకున్న అతడు నిర్మాతగా, బుల్లితెర హోస్ట్ గా, బిజినెస్ మేన్ గా, విశ్లేషకుడిగా రాణిస్తున్నాడు. అతడి ఆల్ రౌండర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
రానా తాజా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో తన సాన్నిహిత్యం గురించి మాట్లాడాడు. చరణ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ కావడంతో చిరు స్టార్ డమ్ ను తాను ఎంజాయ్ చేయలేకపోయానని, ఆయనను ఎప్పుడూ నా ఫ్రెండ్ కి తండ్రిగానే చూశానని తెలిపారు. ``అందరూ చిరును దగ్గరగా చూడాలని అనుకుంటారు. కానీ నేను దొరక్కపోయేవాడిని. అప్పట్లో ఓసారి కొత్త టెలీస్కోప్ ని పగులగొట్టాను. వెంటనే ఒకటి టప్ మని పీ*రు`` అని రానా తెలిపారు.
వేరొక ఇంటర్వ్యూలో మెగా హీరోలతో పోటీ గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ తాను, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకరి సినిమాలపై మరొకరు ఎలాంటి అహం లేకుండా నిర్మాణాత్మకంగా విమర్శించుకుంటామని అన్నారు. మేము వేర్వేరు రేసులను నడుపుతున్నామని కూడా సరదాగా ఛమత్కరించారు. తమ మధ్య ప్రేమ, విమర్శలు మాత్రమే ఉన్నాయి పోటీ కాదని అన్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైనా కానీ, తన నుంచి నిర్మాణాత్మక విమర్శలను ఎదుర్కొంటారని రానా చెప్పారు. అంతేకాదు రానా వారి సినిమాలను విశ్లేషిస్తూ ప్రతి అంశాన్ని విడివిడిగా చర్చిస్తాడు.. ప్రాజెక్ట్‌లను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. బాక్సాఫీస్ నంబర్లు ఒక్కటే ప్రత్యక్షమైన విషయం. కానీ మేం సినిమా గురించి చాలా విషయాలను విశ్లేషిస్తామని తెలిపారు.
అల్లు అర్జున్ పుష్ప 1లో మనం చేయనివి ఇంకా ఏమి చేయగలం? అని కూడా విశ్లేషించుకుంటాం. సినిమా పూర్తి అయ్యి, సక్సెస్ అయ్యి, సక్సెస్ కాలేకపోయిన నెలరోజుల తర్వాత కూడా కలుస్తారు.. కానీ మనం ఎక్కడ తప్పు చేశామో ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. అవి నిజంగా మాకు ఎదగడానికి సహాయపడే సంభాషణలు అని తెలిపాడు.