రానా.. రొటీన్ గా కాకుండా..
రానా దగ్గుబాటి ఓ వైపు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తూ స్టార్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 10 Sep 2024 6:37 AM GMTరానా దగ్గుబాటి ఓ వైపు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తూ స్టార్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కేవలం హీరోగానే చేస్తానని మడికట్టుకొని కూర్చోకుండా బలమైన క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రానా విలన్ గా నటించిన వేట్టయాన్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరాకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఇదిలా ఉంటే రానా నిర్మాణ భాగస్వామిగా చేసిన 35 చిన్న కథ కాదు తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కంటెంట్ మూవీస్ లో ఇది ఒకటనే మాట వినిపిస్తోంది. సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ ఉండటంతో మంచి కలెక్షన్స్ వస్తాయని తెలుస్తోంది.
గతంలో రానా దగ్గుబాటి కేరాఫ్ కంచరపాలెం అనే సినిమాకి నిర్మాణ భాగస్వామిగా మారి రిలీజ్ చేశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. చాలా కాలం నుంచి ప్రొడ్యూసర్ గా కూడా అడుగులు వేయాలని రానా అనుకుంటున్నారు. 35 చిన్న కథ కాదు సినిమా హిట్ కావడంతో ఇప్పుడు నిర్మాతగా మరిన్ని ప్రాజెక్ట్స్ లలో భాగం కావాలని రానా అనుకుంటున్నారు. స్పిరిట్ మీడియా బ్యానర్ తో నిర్మాణ భాగస్వామిగా రానా ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యారు..
35 చిన్న కథ కాదు తర్వాత ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మొదలైన కాంత సినిమాకి రానా నిర్మాణ భాగస్వామిగా మారాడు. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రానికి మరో నిర్మాతగా ఉన్నారు. ఇద్దరు కలిసి కాంత చిత్రాన్ని మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా కూడా రానా దగ్గుబాటి నటిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే కంటెంట్ బేస్డ్ కథలతో తెరకెక్కే సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా చేయాలని రానా అనుకుంటున్నాడంట.
ఇకపై రెగ్యులర్ గా స్పిరిట్ మీడియా బ్యానర్ నుంచి మూవీస్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రానా నిర్మాణ భాగస్వామిగా ఉంటే ఆ చిత్రాలకి ప్రమోషన్ కూడా గట్టిగా అవుతుంది. రానా ఐడియాలజీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. క్రియేటివ్, రియలిస్టిక్ ఐడియాలతో తెరకెక్కే కథలకి రానా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రమోట్ చేస్తాడు. ఇప్పుడు తన బ్యానర్ లో కూడా అలాంటి కథలనే ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారంట.