రానా షోలో లక్కీ భాస్కర్.. డాక్టర్ మీనాక్షి సీక్రెట్..!
దీనికి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది. దుల్కర్, మీనాక్షి లతో రానా షో సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది.
By: Tupaki Desk | 25 Dec 2024 9:35 AM GMTదగ్గుబాటి రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న ది రానా దగ్గుబాటి షో లో ఇప్పటికే చాలామంది స్టార్స్ ని చాలా క్లోజ్ గా వెళ్లి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రతి శనివారం ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో రానా ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. లాస్ట్ వీక్ కాంతారా స్టార్ రిషబ్ శెట్టి ఇంటర్వ్యూతో ఆడియన్స్ ని ఖుషి చేయగా లేటెస్ట్ గా రానా లక్కీ భాస్కర్ అదే దుల్కర్ సల్మాన్ తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించాడు. ఈ ఎపిసోడ్ లోనే లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది. దుల్కర్, మీనాక్షి లతో రానా షో సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. ఈ ప్రోమోలోనే దుల్కర్ తనకు రానా నైన్త్ స్టాండర్డ్ నుంచి తెలుసు అని అన్నాడు. అప్పటికే తాను రెండుసార్లు ఫెయిల్ అయ్యానని అని సరదాగా అన్నాడు. ఇక మీనాక్షి గురించి చెబుతూ ఏంటి నువ్వు ప్రొఫెషనల్ డెంటిస్టా అని అన్నాడు రానా. దానికి అవును అంటూ మీనాక్షి సమాధానం ఇచ్చింది. లక్కీ భాస్కర్ సూపర్ హిట్ జంటతో రానా స్పెషల్ ఎపిసోడ్ అదిరిపోయేలా ఉంది.
మలయాళ హీరోనే అయినా దుల్కర్ సల్మాన్ కి తెలుగులో వరుస హిట్లు పడుతున్నాయి. మహానటి తో సూపర్ హిట్ అందుకున్న దుల్కర్ ఆ తర్వాత సీతారామం తో కూడా అదరగొట్టాడు. ఇక థర్డ్ సినిమా లక్కీ భాస్కర్ తో కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. తెలుగులో తనకు చాలా అవకాశాలే వస్తున్నా వాటిలో తనకు సూటయ్యేలా పర్ఫెక్ట్ కథలను ఎంపిక చేసుకుంటున్నాడు దుల్కర్. అందుకే అతని సక్సెస్ గ్రాఫ్ సినిమా సినిమాకు పెరుగుతూ వస్తుంది.
దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ సినిమా కాంతా లో రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. రానా షోలో దుల్కర్, మీనాక్షి ఫన్నీ చిట్ చాట్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించనుంది. ఈ శనివారం రాబోతున్న ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అమేజాన్ ప్రైం లో వస్తున్న రానా దగ్గుబాటి షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెలబ్రిటీ చిట్ చాట్ షోస్ లో రానా షో కూడా సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది.