రాక్షస నాయకుడి అరాచకాలు తెరపైకి?
రాక్షస రాజు టైటిల్ బావుంది.. తేజ రాసుకున్న స్క్రిప్టు అద్భుతంగా ఉంది. ఇది రాక్షస లక్షణాలున్న నాయకుడి కథ.
By: Tupaki Desk | 19 Sep 2024 5:15 PM GMT`నేనే రాజు నేనే మంత్రి` లాంటి హిట్ సినిమాలో నటించాడు రానా దగ్గుబాటి. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయం సాధించాక, సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం సాగింది. తేజ స్వయంగా సీక్వెల్ కథ, స్క్రిప్టు రచన కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. మొత్తానికి స్క్రిప్టు సిద్ధమైనా కానీ, ఎందుకనో రానాతో ముందుకు వెళ్లలేకపోయాడు. అదే సమయంలో రానా సోదరుడు అభిరామ్ తో అహింస అనే సినిమా తీసాడు. కానీ డెబ్యూ హీరో సినిమా డిజాస్టరవ్వడం తేజను తీవ్రంగా నిరాశపరిచింది.
కారణం ఏదైనా కానీ, రానాతో తేజ సినిమా అంతకంతకు ఆలస్యమైంది. అయితే అంత డిలే అయినా కానీ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు. కేవలం వాయిదాల ఫర్వంలో మాత్రమే ముందుకు వెళుతోంది. ఇంతకుముందే దీనికి రాక్షస రాజు అనే టైటిల్ ని కూడా ప్రకటించారు. కానీ టైటిల్ ప్రకటించినంత మాత్రాన సెట్స్ కెళతారు అనుకుంటే పొరపాటే. ఇప్పటికీ దీనికి సంబంధించిన సరైన సమాచారం లేకపోవడం నిరాశపరుస్తోంది. చివరికి తేజ తన వారసుడి డెబ్యూ మూవీ సన్నాహకాల్లో ఉండడంతో రానా తో మూవీ గురించి ఆలోచించడం లేదని గుసగుస వినిపిస్తోంది.
రాక్షస రాజు టైటిల్ బావుంది.. తేజ రాసుకున్న స్క్రిప్టు అద్భుతంగా ఉంది. ఇది రాక్షస లక్షణాలున్న నాయకుడి కథ. రెగ్యులర్ నాయకుడితో పోలిస్తే పదింతలు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. సరిగా తెరకెక్కిస్తే హిట్టు పడ్డట్టేనని టాక్ కూడా ఉంది. కానీ ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించే కంటే ఎవరైనా డెబ్యూ దర్శకుడితో పట్టాలెక్కిస్తే బావుంటుందని దగ్గుబాటి రానా భావిస్తున్నట్టు ప్రముఖ మీడియా కథనం పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరు? సెట్స్ కి ఎప్పుడు వెళతారు? అనే వివరాలేవీ బయటకు రాలేదు. దీనికి కాలమే సమాధానం ఇస్తుందేమో చూడాలి.