Begin typing your search above and press return to search.

రానా (X) మిహీక‌: అంద‌మైన పెయింటింగ్‌లా జంట పాదాలు!

హాయిగా మూవీ నైట్ ఆస్వాధ‌న‌లు.. బీచ్‌లో కూల్ కూల్‌గా గడపడం .. కేఫ్‌లో క‌లిసి జాలీగా కాఫీ తాగడం.. ఇవ‌న్నీ వీరికి కొత్తేమీ కాదు కానీ, ప్ర‌తిసారీ మిహీక షేర్ చేసే ఫోటోగ్రాఫ్స్ వాటి ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 Jan 2025 11:34 AM GMT
రానా (X) మిహీక‌: అంద‌మైన పెయింటింగ్‌లా జంట పాదాలు!
X

బీచ్ కి వెళ్లినా.. కేఫ్ లో ఉన్నా లేదా ఇంటి లాన్‌లో టీవీ చూస్తున్నా.. ఈ అంద‌మైన జంట షేర్ చేసే ఆ ఒక్క ఫోటోగ్రాఫ్‌ కామ‌న్‌గా క‌నిపిస్తుంది. ఆ ఇద్ద‌రి కాళ్లు వారి అంద‌మైన పాదాల‌ను మాత్రమే ప్ర‌ద‌ర్శించడం ప్ర‌తిసారీ చూస్తున్నాం. ఇక‌పైనా ఇలాంటి ఒక ఫోటోగ్రాఫ్ తార‌స‌ప‌డితే కచ్ఛితంగా అది రానా- మిహీక జంట‌! అని ఇట్టే క‌నిపెట్టేస్తారు అభిమానులు. ఓకే...! ఇదంతా ఫ‌న్ పార్ట్ అనుకుంటే, రానా- మిహీక దంప‌తుల అన్యోన్య‌త స్నేహం, జంట గోల్స్ ఎప్పుడూ ఆస‌క్తిని క‌లిగిస్తుంటాయి.

ఆ ఇద్దరూ ఇండ‌స్ట్రీలో ఎంట‌ర్‌ప్రెన్యూర్స్. ఎవ‌రి రంగంలో వారు నిష్ణాతులు. మిహీకా బ‌జాజ్ ఫ్యాష‌న్ రంగంలో రాణిస్తుండ‌గా, రానా సినిమా వ్యాపారం, న‌ట‌న‌లో ఎప్పుడూ బిజీగా ఉన్నాడు. అత‌డు టీవీ హోస్ట్ గాను స‌త్తా చాటుతున్నాడు. వీట‌న్నిటికీ మించి ఈ అంద‌మైన జంట ఒక‌రినొక‌రు మ‌న‌స్ఫూర్తిగా ఇష్ట‌ప‌డి ప్రేమించి పెళ్లాడారు. ఈ విష‌యాన్ని రానా ఇంత‌కుముందు వెల్ల‌డించారు.

హాయిగా మూవీ నైట్ ఆస్వాధ‌న‌లు.. బీచ్‌లో కూల్ కూల్‌గా గడపడం .. కేఫ్‌లో క‌లిసి జాలీగా కాఫీ తాగడం.. ఇవ‌న్నీ వీరికి కొత్తేమీ కాదు కానీ, ప్ర‌తిసారీ మిహీక షేర్ చేసే ఫోటోగ్రాఫ్స్ వాటి ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటూనే ఉన్నాయి. మిహీక - రానా జంట అందమైన కెమిస్ట్రీ హృదయాలను దోచుకుంటుంది. వారి జాలీ లైఫ్ ఎంతో ఆక‌ర్ష‌ణీయమైన‌ది. అంతేకాదు ల‌గ్జ‌రీ యాంబియెన్స్ నుంచి మిహీక షేర్ చేసే ప్ర‌తి ఫోటోగ్రాఫ్ ఒక పెయింటింగ్ లా ఆక‌ర్షిస్తుంది.

కెరీర్ ప‌రంగా... అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ది రానా దగ్గుబాటి షో' హోస్ట్‌గా అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నారు. ఈ షోకు సానుకూల స్పందనలు వ‌చ్చాయి. షోకి ఆద‌ర‌ణ బావుంది. అత‌డి ఛ‌మ‌త్కార‌మైన శైలిని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు. మిహీక సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌లో నిరంత‌రం త‌న‌దైన ఫ్యాష‌న్ సెన్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూనే ఉన్నారు.